CM Revanth Reddy Interesting Comments : బాబూ మ‌మ్మ‌ల్ని బ‌త‌క‌నీయ‌వా ప్లీజ్

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి వేడుకోలు

Hello Telugu - CM Revanth Reddy Interesting Comments

Hello Telugu - CM Revanth Reddy Interesting Comments

CM Revanth Reddy : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
త‌మ‌ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని కోరారు. మీరు బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బ్రతకనివ్వండి అంటూ కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారంగా వ్యవహరించాల‌న్నారు. పెద్ద మ‌న‌సు చాటుకోవాల‌ని సూచించారు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). మీరు సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తామ‌న్నారు. కానీ మా విజ్ఞప్తులను వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు బాగా తెలుసు అని హెచ్చ‌రించారు.

CM Revanth Reddy Comments

అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా పాలమూరును అభివృద్ధి చేసి తీరుతామ‌న్నారు. పాల‌మూరులో ఊరు లేక పోయినా ఇక్క‌డి బిడ్డ‌లు నీకు ఓట్లు వేసి గెలిపిస్తే నువ్వు ఏం చేశావో చెప్పాల‌ని డిమాండ్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి. ప‌దే ప‌దే నీళ్ల నిరంజ‌న్ రెడ్డి తానేదో గొప్ప‌లు చేసిన‌ట్లు చెబుతుంటార‌ని, కానీ ఆయ‌న చేసింది ఏమిటో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్యత ఉంద‌న్నారు సీఎం.

ప‌దేళ్ల పాటు పాలించిన మీరు మీ ఆస్తుల‌ను కాపాడుకునేందుకే ప్ర‌య‌త్నం చేశారే త‌ప్పా ఏనాడైనా అభివృద్ది గురించి ఆలోచించారా అని ప్ర‌శ్నించారు. కేవ‌లం క‌ల్వ‌కుంట్ల కుటుంబమే బాగు ప‌డింద‌ని, ప్ర‌జ‌లు నానా ఇక్క‌ట్ల‌కు గుర‌య్యారంటూ వాపోయారు. అందుకే ప్ర‌జ‌లు బీఆర్ఎస్ పార్టీని బండ‌కేసి కొట్టార‌ని అన్నారు. అయినా కేసీఆర్ ఫ్యామిలీకి బుద్ది రావ‌డం లేద‌న్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.

Also Read : Deputy CM Bhatti Fired on BRS : బీఆర్ఎస్ పాల‌న‌లో తెలంగాణ‌కు అన్యాయం

Exit mobile version