MLA Kolikapudi Shocking : విచార‌ణ‌కు హాజ‌రైన ఎమ్మెల్యే కొలిక‌పూడి

పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ ముందుకు

Hello Telugu - MLA Kolikapudi Shocking

Hello Telugu - MLA Kolikapudi Shocking

MLA Kolikapudi : అమ‌రావ‌తి : ఏపీలో సంచ‌ల‌నంగా మారారు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస రావు (MLA Kolikapudi). ఎన్నిక‌ల సంద‌ర్బంగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని (చిన్ని)కి త‌న ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు లంచంగా డిమాండ్ చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అంతే కాదు ఇందుకు సంబంధించి తాను ఎంపీకి చెల్లించిన డ‌బ్బుల‌ను , వాటి వివ‌రాల‌ను స్క్రీన్ షాట్స్ తో వాట్సాప్ వేదిక‌గా పంచుకున్నారు. దీనినే ఆయ‌న స్టేట‌స్ లో పెట్టుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. దీనిపై టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ అయ్యారు. వెంట‌నే స‌మ‌స్య‌పై ఆరా తీశారు. ఎవ‌రైనా స‌రే, ఎంత‌టి వారైనా స‌రే పార్టీ గీత దాటితే వేటు త‌ప్ప‌ద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేర‌కు పార్టీ లైన్ దాటి కామెంట్స్ చేయ‌డ‌మే కాదు అధికార పార్టీకి చెందిన ఎంపీపై ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు.

MLA Kolikapudi Introgation for Investigation

ఇందులో భాగంగా పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ విచార‌ణ చేప‌ట్టాల‌ని, ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే కొలిక‌పూడికి షోకాజ్ నోటీసు జారీ చేయాల‌ని రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస రావును ఆదేశించారు. ఈ అంశం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ ముందు హాజ‌ర‌య్యారు. తిరువూరు నియోజకవర్గానికి పార్టీ టికెట్ దక్కించు కోవడానికి నాని కోట్ల రూపాయలు తీసుకున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. తర్వాత టీడీపీ హైకమాండ్ ఇద్దరు నాయకులను పిలిపించింది. ఎమ్మెల్యే తన వాట్సాప్ స్టేటస్‌లో చెల్లింపున‌కు సంబంధించిన పోస్ట్ క‌ల‌క‌లం రేపింది. దీనిపై వివ‌ర‌ణ అడిగార‌ని స‌మాచారం. ఇది పార్టీలో రాజకీయ తుఫానుకు దారితీసింది . ఇదిలా ఉండ‌గా ఎమ్మెల్యే త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు ఎంపీ చిన్ని.

Also Read : Prof Kodandaram Reddy Important Update : న‌వీన్ యాద‌వ్ కు టీజేఎస్ మ‌ద్ద‌తు

Exit mobile version