Harish Rao : హైదరాబాద్ – ఏపీకి మేలు చేకూర్చేలా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కేవలం తన గురువు నారా చంద్రబాబు నాయుడు ఏది చెబితే అది చేస్తూ వెళుతున్నాడని, దీని వెనుక ఉన్న మర్మం, ప్రయోజనాలు ఏమిటో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీకి తాను వెళ్లనంటూ ప్రకటించిన రేవంత్ ఉన్నట్టుండి ఢిల్లీకి పెట్టే బేడా సర్దుకుని ఆగమేఘాల మీద హాజరయ్యాడని, దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం సీఎంకు ఉందన్నారు.
Harish Rao Slams CM Revanth Reddy
బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నాడంటూ సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యారు హరీశ్ రావు (Harish Rao). సోయి లేకుండా అబద్దాలు ఆడుతున్నాడని ఆరోపించారు. అసలు ఎజెండాలో లేనే లేదని, చర్చలు జరపలేదని అబద్దం చెప్పాడని అన్నారు. బనకచర్ల చర్చకు వచ్చిందని, నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల చెప్పారని మరి ఇప్పుడు ఏమంటారంటూ ప్రశ్నించారు.
కేంద్రంతో జరిగిన చర్చల్లో ఎజెండాలో మొదటి అంశం బనకచర్లపై ఉంటే, రేవంత్ రెడ్డి అసలు ఎజెండాలో ఆ అంశమే లేదని అబద్ధాలు మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు హరీశ్ రావు.
బనకచర్లపై కమిటీ చెప్తే తాము ఒప్పుకుంటామని బహిరంగంగా చెప్పడం సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. గోదావరి మీద బనకచర్ల కట్టొచ్చని కమిటీతో కేంద్రం చెప్పిస్తే, రేవంత్ రెడ్డి ఎలా అయినా ఒప్పుకుంటాడని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి మధ్య అర్ధరాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.
Also Read : KTR Shocking to MLC Kavitha : కవిత లేఖాస్త్రం కార్మిక సంఘం పదవికి గండం
