KTR Shocking to MLC Kavitha : క‌విత లేఖాస్త్రం కార్మిక సంఘం ప‌ద‌వికి గండం

సోద‌రికి కోలుకోలేని షాక్ ఇచ్చిన అన్న కేటీఆర్

hellotelugu-ktr

KTR : హైద‌రాబాద్ – క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో అంత‌ర్గ‌త విభేదాలు మ‌రోసారి బ‌య‌ట ప‌డ్డాయి. ఇప్ప‌టికే బీఆర్ఎస్ పై లేఖాస్త్రం సంధించి సంచ‌ల‌నంగా మారిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TGBKS) ఇంచార్జ్ గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. తెలంగాణ భ‌వ‌న్ లో సంఘం నేత‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. BRS అనుబంధంగా ఏర్పడిన TGBKS కు ఎమ్మెల్సీ కవిత ఇప్పటి వరకు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన‌ నేపథ్యంలో ఈ నియామకం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

KTR Shocking

త‌న తండ్రి, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న స‌మ‌యంలోనే కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం, పార్టీ రోజు రోజుకు బ‌ల‌హీన ప‌డుతోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డంతో క‌వితకు సంబంధించిన ఒక్కో ప‌ద‌విని ఊడ బెరికేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమె వెంట కీల‌క నేత‌లు ఎవ‌రూ వెళ్ల‌డం లేదు. అటు వైపు చూడాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. నిన్న‌టి దాకా పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన కేసీఆర్ ఉన్న‌ట్టుండి కేటీఆర్ కే పార్టీ బాధ్య‌త‌ల‌న్నీ అప్ప‌గించారు. దీంతో కొంత నిరాశ‌కు లోనైంది క‌విత‌. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వ‌ర్యంలో బతుక‌మ్మ‌కు ప్రాచుర్యం క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది ఎమ్మెల్సీ. ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి ధిక్కార స్వ‌రం వినిపించ‌డంతో కేటీఆర్ ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చారు. ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వ‌ర్ కు క‌ట్ట‌బెట్టారు.

Also Read : Uttam Kumar Reddy Shocking Comments : నదీ జలాల వినియోగంలో టెలిమెట్రి విధానం

Exit mobile version