MLA Harish Rao Fired on CM Revanth Govt : మొక్క‌జొన్న రైతులపై కాంగ్రెస్ స‌ర్కార్ వివ‌క్ష

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వ‌క పోతే ఎలా అన్న హ‌రీశ్

Hello Telugu - MLA Harish Rao Fired on CM Revanth Govt

Hello Telugu - MLA Harish Rao Fired on CM Revanth Govt

Harish Rao : హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు (Harish Rao) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైంద‌ని ఆవేద‌న చెందారు. రాష్ట్ర స‌ర్కార్ నిద్ర పోతోంద‌ని వాపోయారు. సీఎం నిర్వాకం కార‌ణంగానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని మండిప‌డ్డారు. క్వింటాల్‌కు రూ. 2400 దక్కాల్సిన మొక్క జొన్న‌ల‌కు రూ. 1600 కే కొనడం అన్యాయం అని అన్నారు. రైతులను దళారులు దోచుకుంటుంటే మీకు సంతోషంగా ఉందా అంటూ ప్ర‌శ్నించారు హ‌రీశ్ రావు. మీ ఢిల్లీ టూర్లు, సెటిల్మెంట్లు, సొంత పనులు పక్కనబెట్టి అన్నదాతల ఆవేదన వినాల‌ని డిమాండ్ చేశారు. మద్దతు ధరతో పాటు మీరు ఇస్తామన్న రూ. 330 బోనస్ ఇవ్వాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. తక్షణమే రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌న్నారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆందోళనలు చేపడతామ‌ని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి.

MLA Harish Rao Slams CM Revanth Reddy Govt

ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా శాఖ‌ల‌లో ప‌ని చేస్తున్న వారికి జీతాలు రాలేద‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ గెస్ట్ లెక్చరర్ల 9 నెలల పెండింగ్ వేతనాలు ఇంకా చెల్లించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు హ‌రీశ్ రావు. జీతాలు ఇవ్వక, ఉద్యోగాలు మానేసే పరిస్థితి వారికి కల్పించడం దుర్మార్గం అన్నారు. బతుకమ్మ, దసరా పండుగలు కూడా జరుపుకోకుండా లెక్చరర్లు పస్తులు ఉండేలా చేసిన పాపం ఈ పాపిష్టి కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఫైర్ అయ్యారు. నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉంటే వారి బతుకు ఎలా సాగుతుంది, కుటుంబ పోషణ ఎలా జరుగుతుందో ఆలోచించాల‌న్నారు . అధికారులను కలిసి ఎన్నిసార్లు విన్న వించుకున్నా ఫలితం లేక పోవడంతో, ఓపిక నశించి కళాశాలకు వెళ్లకూడదని నిర్ణయించు కోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

Also Read : Ex Minister Srinivas Goud Fired on Congress Govt : హామీలు స‌రే ఆచ‌ర‌ణ మాటేంటి..?

Exit mobile version