MLA Battula Laxma Reddy Huge Donation : రైతుల కోసం ఎమ్మెల్యే రూ. 2 కోట్ల విరాళం

సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అంద‌జేత‌

Hello Telugu - MLA Battula Laxma Reddy Huge Donation

Hello Telugu - MLA Battula Laxma Reddy Huge Donation

Battula Laxma Reddy : హైద‌రాబాద్ : మిర్యాలగూడ ఎమ్మెల్యే బ‌త్తుల లక్ష్మారెడ్డి (Battula Laxma Reddy) గురువారం త‌న కుటుంబ స‌భ్యుల‌తో హైద‌రాబాద్ లోని ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్క‌డ సీఎంను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ఏకంగా రూ. 2 కోట్ల రూపాయ‌ల చెక్కును త‌న‌కు అంద‌జేశారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మిర్యాల‌గూడ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలోని రైతుల కోసం ఖ‌ర్చు చేయాల‌ని రేవంత్ రెడ్డికి విన్న‌వించారు. గ‌త కొన్ని రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వాపోయారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్య‌త స‌ర్కార్ పై ఉంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో త‌మ వంతు కూడా సాయం చేస్తున్నామ‌ని చెప్పారు.

MLA Battula Laxma Reddy Donates

ఈ డ‌బ్బుల‌ను కేవ‌లం రైతుల కోసం మాత్ర‌మే ఖ‌ర్చు చేయాల‌ని కోరారు ఎమ్మెల్యే బ‌త్తుల ల‌క్ష్మారెడ్డి. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని విజ్ఞ‌ప్తి చేశారు ముఖ్య‌మంత్రికి. ఇదిలా ఉండ‌గా ఇటీవల ఎంఎల్ ఏ కుమారుడు సాయి ప్రసన్న వివాహం గ్రాండ్ గా జ‌రిపించారు. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావిచారు బ‌త్తుల ల‌క్ష్మారెడ్డి. పెళ్లి రిసెప్షన్ ను రద్దు చేసుకొని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రైతుల కోసం భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసినందుకు అనుముల రేవంత్ రెడ్డి ప్ర‌త్యేకంగా ఎమ్మెల్యేను, ఆయ‌న కుటుంబీకుల‌ను అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి కి చెక్ అందజేసీన వారిలో ఎంఎల్ఏ కుమారుడు సాయి ప్రసన్న, కోడలు వెన్నెల, త‌దిత‌రులు ఉన్నారు.

Also Read : TTD Vigilance Strong Focus : బ్ర‌హ్మోత్స‌వాలలో భ‌ద్ర‌త‌పై స‌మీక్ష : సీవీఎస్వో

Exit mobile version