TTD Vigilance Strong Focus : బ్ర‌హ్మోత్స‌వాలలో భ‌ద్ర‌త‌పై స‌మీక్ష : సీవీఎస్వో

భ‌క్తుల సెక్యూరిటీ, పార్కింగ్ పై దృష్టి సారించాలి

Hello Telugu - TTD Vigilance Strong Focus

Hello Telugu - TTD Vigilance Strong Focus

TTD : తిరుమ‌ల : శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్బంగా పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ. ఇదిలా ఉండ‌గా సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు జ‌ర‌గ‌నున్నాయి ఉత్స‌వాలు. ఈ సంద‌ర్బంగా టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసు, టీటీడీ (TTD) అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్, శ్రీవారి వాహన సేవలలో వినియోగించే వివిధ వాహనాల పటిష్టత, అనుమానస్పద వ్యక్తులపై నిఘా వంటి అంశాలపై చర్చించారు.

TTD Focus

ట్రాఫిక్ అంతరాయం లేకుండా తిరుమల, తిరుపతిలలో పార్కింగ్ లు ఏర్పాటు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు సీపీఎస్వో ముర‌ళీకృష్ణ‌. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఎలక్ట్రికల్ కటౌట్లు, ఎల్ఈడీ స్క్రీన్ల పటిష్టత తనిఖీ చేయాల‌న్నారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహన సేవలకు వినియోగించే వాహనాల స్థిరత్వం ,దృఢత్వం పరిశీలన చేయాల‌న్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు విచ్చేసే కార్మికులు, ఆర్టీసీ డ్రైవర్ల గుర్తింపు తనిఖీ క‌చ్చితంగా చేయాల‌న్నారు. అధిక రద్దీ నేపథ్యంలో ముందస్తుగా అదనపు వాహనాల పార్కింగ్ ఏర్పాటు పై ప్రణాళిక రూపొందించాల‌ని స్ప‌ష్టం చేశారు మురళీకృష్ణ‌.

టీటీడీ నిఘా, జిల్లా పోలీసు, టిటిడి అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఈ సమావేశంలో టీటీడీ సిఈ సత్య నారాయణ, తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, టీటీడీ విభాగాధిపతులు, జిల్లా పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : Minister Atchannaidu- Interesting Update : ఏపీలో ఎలాంటి యూరియా కొర‌త లేదు

Exit mobile version