MLA Bandla Krishna Mohan Shocking Comments : నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా : బండ్ల‌

కాంగ్రెస్ పార్టీలో ఉన్నాన‌నేది అబ‌ద్దం

Hello Telugu - MLA Bandla Krishna Mohan Shocking Comments

Hello Telugu - MLA Bandla Krishna Mohan Shocking Comments

Bandla Krishna Mohan : జోగులాంబ గ‌ద్వాల జిల్లా : గ‌ద్వాల శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేర‌లేద‌ని అన్నారు. కొంద‌రు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ది కోసం మాత్ర‌మే సీఎం ఎ. రేవంత్ రెడ్డిని క‌లిశాన‌ని , తాను ఇప్ప‌టికీ తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తోనూ, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ట‌చ్ లో ఉన్నాన‌ని చెప్పారు. త‌న‌పై వేటు వేస్తార‌ని , పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. అధికారంలో ఉన్నా లేక పోయినా నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ది కోసం త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వంలో ఎవ‌రు ఉంటే వారిని క‌ల‌వ‌డం త‌ప్ప‌ద‌న్నారు. బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి (Bandla Krishna Mohan) మీడియాతో మాట్లాడారు.

MLA Bandla Krishna Mohan Reddy Key Comments

తాను ఏనాడూ పార్టీ మార‌లేద‌ని, అదంతా ఒట్టి అబ‌ద్ద‌మేనంటూ కొట్టి పారేశారు ఎమ్మెల్యే. ఇదిలా ఉండ‌గా బీఆర్ఎస్ పార్టీ ద్వారా బి ఫార‌మ్ పొంది, ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలుపొందిన వారంతా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీర‌డంతో జంప్ అయ్యారు. అంద‌రూ చూస్తూ ఉండ‌గానే కండువాలు కూడా క‌ప్పుకున్నారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ధ‌ర్మాసనం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఛెంప ఛెళ్లుమ‌నిపించేలా కామెంట్స్ చేసింది. కొత్త సంవ‌త్స‌రంలో ఇంట్లో ఉంటావా లేక జైలులో ఉంటావో తేల్చుకోమంటూ వార్నింగ్ ఇచ్చింది. దెబ్బ‌కు నోటీసులు జారీ చేయ‌డంతో స్పందించారు బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి.

Also Read : Minister Sridhar Babu Fired on KTR : కేటీఆర్ ఆరోప‌ణ‌లు పూర్తిగా అబ‌ద్దం

Exit mobile version