MLA Bandaru Sravani interesting Comments : ఆర్డీటీ సంస్థ‌కు అండ‌గా ఉంటాం

హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రావ‌ణి

Hello Telugu - MLA Bandaru Sravani interesting Comments

Hello Telugu - MLA Bandaru Sravani interesting Comments

Bandaru Sravani : అనంత‌పురం జిల్లా : నిస్వార్థంగా రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఆర్డీటీ స్వ‌చ్చంధ సేవా సంస్థ కృషి చేస్తోంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి (Bandaru Sravani). గ‌త కొంత కాలంగా కొంద‌రు ఆర్డీటీ సంస్థ‌ను ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా ఆర్డీటీ సంస్థ నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ ని టీడీపీ ఎమ్మెల్యేల బృందంతో మర్యాద పూర్వకంగా కలివారు. ఆర్డీటీ సంస్థ ఎఫ్‌.సీ‌.ఆర్‌.ఏ రెన్యూవల్ అంశంపై కేంద్రం వద్ద జరిగిన పరిణామాలు, అసెంబ్లీలో జరిగిన చర్చలు, కేంద్ర మంత్రులు అందించిన సహాయ సహకారాలపై ఈ సంద‌ర్భంగా సమగ్రంగా చర్చించారు.

MLA Bandaru Sravani Comments

ఆర్డీటీ సంస్థ పేదలకు చేస్తున్న సేవ‌లు ప్రశంసనీయం అన్నారు బండారు శ్రావ‌ణి. ఈ సంస్థకు సంబంధించిన రెన్యూవల్ విషయంపై త్వరలోనే కేంద్రం నుంచి సానుకూల పరిష్కారం వస్తుందనే నమ్మకం ఉంద‌న్నారు. ఇందుకు సంబంధించి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ స్వ‌యంగా కేంద్రంతో మాట్లాడుతున్నార‌ని చెప్పారు. ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే సంస్థ‌కు త‌మ కూట‌మి స‌ర్కార్ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఈ సమావేశంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి , కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి పాల్గొన్నారు.

Also Read : Deputy CM Pawan Important Update : గంగ పుత్రుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం

Exit mobile version