Deputy CM Pawan Important Update : గంగ పుత్రుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం

స్ప‌ష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

Hello Telugu - Deputy CM Pawan Important Update

Hello Telugu - Deputy CM Pawan Important Update

Deputy CM Pawan : అమ‌రావ‌తి : మ‌త్స్య‌కారులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు త‌న‌కు తెలుస‌ని, వాటిని త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని ప్ర‌క‌టించారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Deputy CM Pawan) కొణిద‌ల‌. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ, సమీప ప్రాంతాల సాగర తీరంలో పరిశ్రమల కాలుష్యం కారణంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉప్పాడ ప్రజల మాటా – మంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి స‌మ‌స్య‌లు విన్నారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్్గొన్నారు ఉప ముఖ్యమంత్రి .ఈ సందర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన 18 మంది మత్స్యకారులకు పరిహారంగా, వారి కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షల చొప్పున 90 లక్షల బీమా అందించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

Deputy CM Pawan Kalyan Comments

గంగ పుత్రులు తెలియ చేసిన ప్రతి సమస్యను, వారి అభిప్రాయాలను అర్ధం చేసుకుని 100 రోజుల లోపు పరిష్కారానికి పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. 3- 4 రోజుల్లో స్వయంగా తీర కాలుష్య ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా కాలుష్య పరిస్థితులు తెలుసుకుంటానని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాన్ కొణిద‌ల‌. మత్స్యకారులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇతర మంత్రిత్వ శాఖలతో చర్చించి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు . ఉప్పాడ రీటైనింగ్ వాల్ పూర్తి చేసి తీరుతామని ప్ర‌క‌టించారు.

Also Read : CM Revanth Reddy – TG Growth : తెలంగాణ పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామం : సీఎం

Exit mobile version