హైదరాబాద్ : తేజ సజ్జ నటించిన ‘మిరాయ్ 2’ మరింత భారీ స్థాయిలో రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘మిరాయ్ 2: జైత్రయ’ అని పేరు పెట్టారు మూవీ మేకర్స్. ఇందులో ప్రభుదేవా కీలక పాత్రలో నటిస్తున్నట్లు కన్ ఫర్మ్ చేశారు. కాగా కథానాయికగా అందాల ముద్దుగుమ్మ శ్రీలీలను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఫాంటసీ సీక్వెల్‌ను 2027లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ ప్రస్తుతం తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం ‘జై హనుమాన్’, ‘మిరాయ్ 2’, ‘జాంబీ రెడ్డి 2’ వంటి చిత్రాలతో పాటు, అమెజాన్ ప్రైమ్ రియాలిటీ షో ‘ట్రైటర్స్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న సినిమాల్లో చాలా వరకు సీక్వెల్స్ కావడంతో వీటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఆయన వివాహానికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ‘మిరాయ్: జైత్రయ’కు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఈ చిత్రంలో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేసే అవకాశం ఉందని, ఇప్పటికే ప్రభుదేవా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారని, ఇది పాన్-ఇండియా చిత్రంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘మిరాయ్’ చిత్రం చివరలో (పోస్ట్-క్రెడిట్స్ సీన్లో) రానా దగ్గుబాటిని ప్రధాన ప్రతినాయకుడిగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ 2026 మే నెలలో ప్రారంభమైంది. కాబట్టి, 2027 ద్వితీయార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టు కోవాలని చిత్ర బృందం భావిస్తోంది. కాబట్టి మనం ఒక అద్భుతమైన ఫాంటసీ దృశ్య కావ్యం కోసం వేచి చూడాల్సిందే.
