Minister Vasamsetti Great Wishes : దీపావళి పండుగ వెలుగులు నింపాలి

కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి శుభాకాంక్షలు

Hello Telugu - Minister Vasamsetti Great Wishes

Hello Telugu - Minister Vasamsetti Great Wishes

Minister Vasamsetti : అమరావతి : రాష్ట్రంలోని ప్రజలకు,కార్మికులందరికీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలుగించు కోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని ఆయన ఒక సందేశం లో పేర్కొన్నారు . జీవితం అంటేనే చీక‌టి వెలుగుల స‌మాహారమ‌ని, దీపావ‌ళి పండుగ నేర్పే పాఠం ఇదేన‌ని పేర్కొన్నారు.

Minister Vasamsetti Diwali Wishes

ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని వెలుగుల పండుగ తెలుగువారి జీవితాల్లో వేల‌ కాంతులు నింపాలని వాసంశెట్టి సుభాష్ (Minister Vasamsetti) ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాకనే ప్రజలు, కార్మికుల జీవితాల్లో వెలుగు జిలుగులు వచ్చాయని ఆయన అన్నారు. జీవితం కష్ట సుఖాల కలబోత, చీకటి వెలుగుల విరిపూత కష్టాల్లోనూ సుఖాన్నికలగనడం ఆశాజీవుల లక్షణం అని పేర్కొన్నారు. ఇదే చిమ్మ చీకట్లను వెలిగించే దివ్య దీపావళి చెబుతున్న సందేశమని అన్నారు.

ఇదిలా ఉండ‌గా ఆయా ఉద్యోగ సంఘాలు సీఎం నారా చంద్రబాబు నాయుడును క‌లిశాయి. ఈ మేర‌కు త‌మ‌కు బాకీ ప‌డిన బ‌కాయిల‌ను చెల్లించాల‌ని కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించారు సీఎం. డీఏను చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్్నారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇవాళ ఏపీ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్టేట్ గా రూపు దిద్దుకుంటోందన్నారు. గూగుల్ కంపెనీ త‌న ఏఐ హ‌బ్ సెంట‌ర్ ను ఏపీలోని విశాఖ‌లో ఏర్పాటు చేసింద‌న్నారు. దీంతో మ‌న స‌త్తా ఏమిటో తెలిసింద‌న్నారు.

Also Read : Mohammad Kaif Fired on Agarkar : చీఫ్ సెల‌క్ట‌ర్ అగార్క‌ర్ పై మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ ఫైర్

Exit mobile version