Mohammad Kaif Fired on Agarkar : చీఫ్ సెల‌క్ట‌ర్ అగార్క‌ర్ పై మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ ఫైర్

సంజూ శాంస‌న్ ను ఎంపిక చేయ‌క పోవ‌డం పై

Hello Telugu - Mohammad Kaif Fired on Agarkar

Hello Telugu - Mohammad Kaif Fired on Agarkar

Mohammad Kaif : ముంబై : భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ మహ‌మ్మ‌ద్ కైఫ్ (Mohammad Kaif) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్, వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ ను వన్డే జ‌ట్టులో ఎంపిక చేయ‌క పోవ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. ఆయ‌న ఆదివారం ఓ ఛానల్ తో జ‌రిగిన చిట్ చాట్ లో నిప్పులు చెరిగారు. అగార్క‌ర్ ఎంపిక పూర్తిగా వివ‌క్ష‌తో కూడుకుని ఉన్న‌ద‌న్నాడు. ఆస్ట్రేలియా టూర్ లో అక్క‌డి మైదానాల‌లో ప‌రుగులు చేయాలంటే బంతి పైకి ఎగిరితే త‌ట్టుకుని ప‌రుగులు చేసే ద‌మ్మున్న ఆట‌గాళ్లు కావాల్సి ఉంటుంద‌న్నాడు. ఇందులో శాంస‌న్ సూప‌ర్ గా ఆడ‌తాడ‌ని, గ‌తంలో కూడా నిరూపించుకున్నాడ‌ని తెలిపాడు. ఇటీవ‌ల జ‌రిగిన ఆసియా క‌ప్ 2025లో సైతం స‌త్తా చాటాడ‌ని పేర్కొన్నాడు.

Mohammad Kaif Slams Chief Selector Agarkar

కానీ అజిత్ అగార్క‌ర్, కోచ్ గంభీర్ క‌లిసి జ‌ట్టును త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఎంపిక చేశార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు మ‌హ‌మ్మ‌ద్ కైఫ్‌. ప్ర‌ధానంగా సంజూ శాంస‌న్ ను ఎంపిక చేయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నాడు. త‌నను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక పోవడం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నాడు. త‌ను వన్డేల్లో 5-6వ నంబర్ బ్యాటర్ అని నిరూపించు కున్నాడ‌ని తెలిపాడు కైఫ్. ఆసియా క‌ప్ లో త‌నకు వ‌చ్చిన ఛాన్స్ ను ఉప‌యోగించు కున్నాడ‌ని, అంతే కాదు ఇండియ‌న ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) మెగా బ‌బిగ్ టోర్నీలో టాప్ సిక్స్ హిట్ట‌ర్ల‌ల‌లో త‌ను కూడా ఒక‌డు అని చెప్పాడు. ఆస్ట్రేలియాలో ఆడాలంటే అక్క‌డి ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లు ఆడాల్సి ఉంటుంద‌న్నాడు.

Also Read : Teenmar Mallanna Shocking Comments : ‘బంద్’ కు మంగ‌ళం శ్రీ‌శైలంలో ‘మ‌ల్ల‌న్న’ ప్ర‌త్య‌క్షం

Exit mobile version