నారాయణపేట జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ప్రజా పాలన వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా తొలి సభ నారాయణపేట జిల్లాలోని మక్తల్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రిగా ఉన్న వాకిటి శ్రీహరి నేతృత్వంలో సభకు జనం పల్చగా హాజరయ్యారు. సీఎం వస్తున్నారని తెలిసినా కేడర్ జన సమీకరణ చేయక పోవడం ఆశ్చర్య పోయేలా చేసింది. ఇది మంత్రికి అవమానకరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, బాధ్యులు, కార్యకర్తలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్లనే జనం రాలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ఖాళీ కుర్చీలు ఉండడం పట్ల వాపోయారు వాకిటి శ్రీహరి.
ఆయన ఆవేదనతో కంటతడిపెట్టారు. ఆపై కేడర్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సభా ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో కుర్చీలు వేయించారు కాంగ్రెస్ నేతలు. అయితే జన సమీకరణ విషయంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహించారు. జనం తక్కువగా ఉండడం ఖాళీ కుర్చీలు ఎక్కువగా కనిపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి తప్పులు చేస్తే తర్వాత బాధ పడక తప్పదంటూ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి మనందరికోసం ఎంత కష్ట పడుతున్నారో అర్థం చేసుకుని నడుచుకుంటే బావుంటుంది అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు.
