Minister Seethakka Fired on KTR : కేటీఆర్..పోలీస్ రాజ్యం ఎక్క‌డుందో చెప్పు

నిప్పులు చెరిగిన మంత్రి దాస‌రి సీత‌క్క

Hello Telugu - Minister Seethakka Fired on KTR

Hello Telugu - Minister Seethakka Fired on KTR

Minister Seethakka : హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేసింది మంత్రి దాస‌రి సీత‌క్క‌. ములుగు జిల్లాలో పోలీస్ రాజ్యం న‌డుస్తోందంటూ ఆధారాలు లేకుండా ఎలా కామెంట్స్ చేస్తారంటూ ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. నిజంగా సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని మండిప‌డ్డారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కల్వ‌కుంట్ల ఫ్యామిలీకి ప‌వ‌ర్ కు దూరం కావ‌డంతో త‌ట్టుకోలేక పోతున్నార‌ని ఫైర్ అయ్యారు.

Minister Seethakka Slams KTR

కేటీఆర్ నువ్వు నిజంగా మనిషివైతే, నీకు కళ్ళు సక్కగా కనపడితే ములుగులో పోలీస్ రాజ్యం ఎక్కడ నడుస్తోందో చెప్పాల‌ని దాసరి సీత‌క్క (Minister Seethakka) డిమాండ్ చేశారు. నువ్వు నీ పార్టీ అబద్దాల పునాదులపై పుట్టకపోతే పోలీసు రాజ్యం ఎక్కడ ఉందో చూయించాల‌న్నారు. 2023 నుంచి 2025 వరకు మీ కార్యకర్తల మీద ఇక్కడి పోలీసులు ఎన్ని కేసులు పెట్టారో చెప్పాల‌న్నారు మంత్రి.

కరోనా సమయంలో సొంత నియోజకవర్గాల్లో కూడా వాళ్లు ప్రజలకు సేవ చేయలేద‌ని ఆరోపించారు. తాను ప్ర‌తిప‌క్ష నాయ‌కురాలిగా రేయింబ‌వళ్లు శ్ర‌మించాన‌ని, అయినా ఓ గిరిజ‌న బిడ్డ మంత్రి కావ‌డాన్ని త‌ట్టుకోలేక పోతున్నాడంటూ కేటీఆర్ పై భ‌గ్గుమ‌న్నారు సీత‌క్క‌. అడవిబిడ్డ అయిన త‌న‌ను టార్గెట్ చేస్తే మీకు ఏం వస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక‌నైనా త‌న మాట తీరు మార్చు కోవాల‌న్నారు. ప్ర‌జ‌లు బుద్ది చెప్పినా త‌న తీరు మార‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : KTR Challenge : ప్రెస్ క్ల‌బ్ లో సీఎం కోసం సీటు సిద్దం – కేటీఆర్

Exit mobile version