KTR Challenge : ప్రెస్ క్ల‌బ్ లో సీఎం కోసం సీటు సిద్దం – కేటీఆర్

ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రావాల‌ని మాజీ మంత్రి స‌వాల్

Hello Telugu - KTR Challenge

Hello Telugu - KTR Challenge

KTR : హైద‌రాబాద్ – తాను విసిరిన స‌వాల్ ను స్వీక‌రించేందుకు సీఎం సిద్దంగా లేడా అని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ కు భారీగా అనుచ‌ర గ‌ణంతో త‌ర‌లి వ‌చ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఊహించ‌ని విధంగా పోలీసులు బందో బ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్బంగా ప్రెస్ క్ల‌బ్ లో ప్ర‌త్యేకంగా రేవంత్ రెడ్డి కోసం ఓ సీటును కేటాయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటా పోటీగా మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది.

KTR Challenge CM Revanth Reddy

ఈ సంద‌ర్బంగా మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోంద‌న్నారు. సోషల్ మీడియా పోస్ట్ రీట్వీట్ చేసినందుకు బలహీన వర్గానికి చెందిన శశిధర్ గౌడ్ అనే కార్యకర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టు పాలన నడుస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేటీఆర్.

తెలంగాణ రైతులను మోసం చేస్తూ నీళ్లు ఏమో గురువు చంద్రబాబుకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు రేవంత్ రెడ్డి తొత్తులకి పోతున్నాయని మండిప‌డ్డారు. 18 నెలల అరాచక పాలన వల్ల చనిపోయిన 600 మంది రైతులకు మౌనం పాటించి, నివాళి అర్పించారు కేటీఆర్. రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద చర్చించడానికి మా పార్టీ నాయకత్వం సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రెస్‌క్లబ్‌కు వ‌చ్చామ‌న్నారు.

Also Read : Indian Railways Shocking : రైలు ప్రయాణికులకు షాకిచ్చిన కేంద్ర రైల్వే శాఖ

Exit mobile version