Minister Savitha Clear Instructions on GST : జీఎస్టీ సంస్కరణ ఫ‌లాలు ప్రతి ఒక్కరికి అందాలి

పిలుపునిచ్చిన రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్. స‌విత‌

Hello Telugu - Minister Savitha Clear Instructions on GST

Hello Telugu - Minister Savitha Clear Instructions on GST

Minister Savitha : గోరంట్ల/శ్రీ సత్యసాయి జిల్లా : పేద, మధ్యతరగతి వర్గాలకు కేంద్ర స‌ర్కార్ సూపర్ గిఫ్ట్ ఇచ్చింద‌న్నారు రాష్ట్ర చేనేత జౌళి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్. సవిత (Minister Savitha). ప్రతి కుటుంబానికి రూ.15వేలు వరకు ఆదా అవుతుందని చెప్పారు. గోరంట్ల మండల కేంద్రం లోని సామాజిక ఆరోగ్య కేంద్రం వ‌ద్ద‌ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం చేప‌ట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. భారతదేశం అందరిలో అగ్రగామిగా ఉండాలని, అన్నిట్లో ముందుండాలని ప్ర‌ధాని మోదీ కోరుకున్నార‌ని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ అన్ని రంగాల్లో ముందుండాలని గొప్ప నిర్ణయంతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. దీని వల్ల రాష్ట్రానికి రూ.8 వేల కోట్ల భారం పడుతుందని అన్నారు.

Minister Savitha Key Comments on GST Reforms

సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు మంత్రి ఎస్. స‌విత‌. జీఎస్టీ ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ కు నాంది అని అన్నారు. ప్రతి ఉత్పత్తిలోనూ పేద ప్రజలకు ఆదా అవుతున్నదని తెలిపారు. ఔషధ మందులపై, ప్రాణాంతక మందులపై జీఎస్టీ ద్వారా ఎంతో మేలు జ‌రుగ‌తుఉంద‌ని, దీనిని ప్రజలు వినియోగించు కోవాలని కోరారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జీఎస్టీ లో స్లాబులు తగ్గింపు కారణంగా ప్రజలు నిత్యం ఉపయోగించే టూత్ పేస్ట్ నుండి ఏ .సి. వరకు అదేవిధంగా రైతులు వినియోగించే సాగు పరికరాల నుండి టాక్టర్ వంటి పెద్ద వస్తువుల వరకు అన్నిరకాల వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయన్నారు.

Also Read : Dasoju Sravan Shocking Comments on Congress : కాంగ్రెస్ పాల‌న మోసానికి చిరునామా

Exit mobile version