Dasoju Sravan : హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలను బకరా చేసిందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ (Dasoju Sravan). తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే కేంద్రంతో తేల్చుకునేందుకు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత ఉందని తెలుసుకునే ఈ బీసీ రిజర్వేషన్ల నాటకానికి తెర లేపారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం తగదన్నారు. బీసీ సమాజం ఒప్పుకోదన్నారు. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు. ఇంకెంత కాలం మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Dasoju Sravan Slams Congress Govt
ఎన్నికలకు తొందర లేదని, రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే నిర్వహించాలని డిమాండ్ చేశారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి కదలాలని, రిజర్వేషన్ల అంశం తేలే వరకు హైదరాబాద్ రావద్దని అన్నారు. 56 సార్లు సొంత పనుల కోసం సీఎం ఢిల్లీకి వెళ్లారని, ఇప్పుడు బీసీల రిజర్వేషన్ల కోసం దేశ రాజధానికి వెళితే వచ్చే నష్టం ఏమీ ఉండదన్నారు. కేవలం జీఓతోనే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని అనుకుంటే 22 నెలలు ఎందుకు ఆగారంటూ నిలదీశారు ఎమ్మెల్సీ. పల్లకి మోసి మా భుజాలు నొప్పి పెడుతున్నాయని, ఇప్పుడు పల్లకి ఎక్కేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఒక్క శాతం రిజర్వేషన్ వెనక్కు పోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు.
Also Read : BRS Party Fired on Congress Govt : బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్
