Minister Savitha Interesting Update : త్వరలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

Hello Telugu - Minister Savitha Interesting Update

Hello Telugu - Minister Savitha Interesting Update

Minister Savitha : అమరావతి : జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) తెలిపారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికనుగుణంగా బీసీ యువతకు కూడా ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నామని వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వరించిన నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను వివిధ బీసీ సంక్షేమ సంఘాల కార్పొరేషన్ చైర్మన్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, అన్ని రంగాల్లో వెనుబడి ఉన్న బడుగు, బలహీన వర్గాల ఉన్నతి కోసం అన్న ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారన్నారు. ఆయన బాటలో నడుస్తున్న సీఎం చంద్రబాబు కూడా బీసీల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.

Minister Savitha Comments

దీనిలో భాగంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పోటీ పరీక్షల నిమిత్తం బీసీ నిరుద్యోగ యువతకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఉచిత శిక్షణ అంద జేశామన్నారు. సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షకు కూడా ఉచిత శిక్షణ ఇచ్చామ‌న్నారు మంత్రి స‌విత‌. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పోటీ పరీక్షల శిక్షణ సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. మెగా డీఎస్సీలో 246 మంది బీసీ బిడ్డలు ఉపాధ్యాయులుగా నియమితులయ్యారన్నారు. మరెంతో మంది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేసిన ఉచిత శిక్షణకు గానూ ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించిందన్నారు.

Also Read : Cricket Umpire Dickie Bird Death : క్రికెట్ అంపైర్ డికీ బ‌ర్డ్ ఇక లేరు

Exit mobile version