Minister Savitha Important Update : స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెరలకు ప్రాధాన్యం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ . సవిత

Hello Telugu - Minister Savitha Important Update

Hello Telugu - Minister Savitha Important Update

Minister Savitha : శ్రీ సత్యసాయి జిల్లా : పార్టీ, నామినేటెడ్ పదవులతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. గోరంట్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రి సవిత (Minister Savitha) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీలకు టీడీపీతోనే రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యం లభిస్తోందన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారన్నారు. బీసీల మనోభావాలకు గౌరవమిస్తూ, విశ్వకర్మ జయంతి, వాల్మీకి జయంతి, కనకదాస జయంతిని అధికారికంగా నిర్వహించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిదేనన్నారు.

Minister Savitha Comments

రేనాటి యోధుడు, అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య దాష్టీకాలను ఎదిరించి మొట్టమొదటి స్వాతంత్ర‌ పోరాటానికి నాంది పలికిన వడ్డే ఓబన్న జయంతిని కూడా అధికారికంగా నిర్వహించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఈ ఏడాది జనవరి 11న ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీల ఆత్మ గౌరవానికి సీఎం చంద్రబాబు ఎప్పుడూ ప్రాధాన్యమిస్తూ ఉంటారన్నారు. ఈ క్రమంలో బీసీల అభ్యున్నతికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అత్యధికంగా లబ్ధి పొందేది బీసీలేనన్నారు. పెనుకొండలో కూటమి అభ్యర్థిగా తన విజయంలో వడ్డెర సామాజిక వర్గీయులు కీలక భూమిక పోషించారని కొనియాడారు.

Also Read : KTR Important Comments on KCR : దేశంలో తెల్ల‌కోటు విప్ల‌వాన్ని తీసుకు వ‌చ్చింది కేసీఆర్

Exit mobile version