Minister Savitha : కర్నూలు జిల్లా : రాష్ట్రంలో మరిన్ని నూతన బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) ప్రకటించారు. వెనుకబడిన తరగతుల విద్యకు కూటమిసర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. దీనిలో భాగంగా బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం పావలా వడ్డీకే విద్యా రుణాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. వాల్మీకులకు ఎస్టీలో చేర్చేలా కృషి చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. మహర్షి వాల్మీకి జయంత్యోత్సవాన్ని స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలతో కలిసి వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి, జ్యోతి ప్రజల్వన చేసి నివాళులర్పించారు.
Minister Savitha Comments
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. మహర్షి వాల్మీకి రచించిన రామాయణం నేటి సమాజానికి సన్మార్గాన్ని చూపుతోందన్నారు. వాల్మీకి మహర్షి వాల్మీకులకు మాత్రమే సొంతం కాదని ప్రపంచానికే సొంతమన్నారు. వాల్మీకి రామాయణం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందన్నారు. రామాయణం కేవలం మత గ్రంథం మాత్రమే కాదని కుటుంబ విలువలు, నైతిక విలువలు బోధిస్తూ, సమాజ నిర్మాణానికి దిక్సూచిగా పనిచేస్తోందని చెప్పారు మంత్రి ఎస్. సవిత. భార్యాభర్తలు, అన్న దమ్ముల మధ్య సఖ్యత గురించి, రాజ్య పరిపాలన ఎలా చేయాలో రామాయణం చదివితే చాలని విదేశీయులు సైతం భావిస్తుంటారన్నారు.
Also Read : MLC Nagababu Interesting Update : జనసేనానికి అర్చకుల ధన్యావాదాలు
