Minister Savitha Alarming : కూట‌మి పాలనలో చేనేతకు స్వర్ణ యుగం

నేత‌న్న‌ల‌కు మంత్రి స‌విత శుభాకాంక్ష‌లు

Hello Telugu - Minister Savitha Alarming

Hello Telugu - Minister Savitha Alarming

Minister Savitha : అమ‌రావ‌తి – కూట‌మి స‌ర్కార్ పాల‌న‌లో చేనేత రంగానికి స్వ‌ర్ణ యుగం ప్రారంభ‌మైంద‌న్నారు మంత్రి స‌విత‌ (Minister Savitha). నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామ‌ని చెప్పారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. చేనేత రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు మూడు ప‌థ‌కాల‌ను తీసుకు వ‌స్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఉచిత విద్యుత్, చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ మినహాయింపు, త్రిఫ్ట్ నిధులు మంజూరు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని అన్నారు మంత్రి స‌విత‌. నేత కార్మికుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామ‌న్నారు.

Minister Savitha Comments

వారికి మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని, వారికి కావాల్సిన అన్ని రుణ స‌దుపాయాలు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు స‌విత‌. చేనేత అనేది భారతదేశ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. గ్రామీణ జీవిన‌ శైలిని ప్రతిబింబించే ఈ రంగం దేశ ఆర్థిక, సాంస్కృతిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. చేనేత ఉత్పత్తులలో ఉన్న నైపుణ్యం, విలక్షణతకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉందని పేర్కొన్నారు. నేత‌న్న‌లు, చేనేత కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంద‌న్నారు. అలాంటి రంగానికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నేటి నుంచి ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతోందని చెప్పారు.

Also Read : Minister Atchannaidu Promote : ప్ర‌తి ఒక్క‌రు చేనేత దుస్తులు ధ‌రించాలి

Exit mobile version