Minister Atchannaidu Promote : ప్ర‌తి ఒక్క‌రు చేనేత దుస్తులు ధ‌రించాలి

పిలుపునిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు

Hello Telugu - Minister Atchannaidu Promote

Hello Telugu - Minister Atchannaidu Promote

Minister Atchannaidu : అమ‌రావ‌తి – ప్ర‌తి ఒక్క‌రు చేనేత దుస్తులు ధ‌రించాల‌ని, నేత‌న్న‌ల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని పిలుపునిచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఆగ‌స్టు 7న దేశ వ్యాప్తంగా చేనేత దినోత్స‌వం జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా చేనేత కార్మికుల‌కు, నేత‌న్న‌ల‌కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న (Minister Atchannaidu) మాట్లాడారు. చేనేత అనేది భారతదేశ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. గ్రామీణ జీవిన‌ శైలిని ప్రతిబింబించే ఈ రంగం దేశ ఆర్థిక, సాంస్కృతిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. చేనేత ఉత్పత్తులలో ఉన్న నైపుణ్యం, విలక్షణతకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించే దిశగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Minister Atchannaidu Key Comments

కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంద‌న్నారు. అలాంటి రంగానికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నేటి నుంచి ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతోందని చెప్పారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని భరించనుంద‌న్నారు. దీంతో పాటు త్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి రూ.5 కోట్లు విడుదల చేయనున్న‌ట్లు ప్ర‌క‌టించారు అచ్చెన్నాయుడు.

చేనేత కళను ప్రోత్సహిస్తూ, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విధానాలు రూపొందిస్తున్నదని తెలిపారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

Also Read : AP Cabinet Approved : ఏపీ మీడియా అక్రిడిటేష‌న్ రూల్స్ మార్పు

Exit mobile version