Minister Savitha : తిరుపతి : ప్రఖ్యాతగాంచిన తిరుపతి పట్టణంలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత,, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత (Minister Savitha) వెల్లడించారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భక్త కనకదాస విగ్రహాన్ని కర్నాటక బీజేపీ నాయకులు రేవణ్ణ, ఎంపీలు బీకే పార్థసారథి, బస్తిపాటి నాగరాజుతో కలిసి మంత్రి సవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నీతి నిజాయితీకి కురుబలు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని కొనియాడారు. కురుబల అభివృద్ధికి టీడీపీ అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అన్న ఎన్టీఆర్ బీసీలకు రాజకీయ వెన్నుదన్నుగా నిలిచారన్నారు. కురుబలకు రాజకీయ ప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు ఎస్ సవిత.
Minister Savitha Key Comments
కురుబ సామాజిక వర్గానికి చెందిన సంజీవరెడ్డి రామచంద్ర రెడ్డికి ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశమిచ్చినట్లు ఎలిపారు. టీడీపీ ప్రభుత్వాల ప్రోత్సాహంతో రామచంద్రారెడ్డి 14 శాఖలకు మంత్రిగా పని చేశారని పేర్కొన్నారు మంత్రి. తర్వాత ఎంపీ బీకే పార్థసారథికి కూడా టీడీపీ రాజకీయ అండ అందించిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కురుబలకు చెందిన ఇద్దరు ఎంపీలుగా, తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కురుబలకు అండగా నిలిచిందని అన్నారు మంత్రి ఎస్. సవిత. తమ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తోందని చెప్పారు.
Also Read : Jajula Srinivas Goud Warning : బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే అగ్గి రాజేస్తం
















