Minister Savitha : అమరావతి : వెనుకబడిన తరగతులకు గౌరవ ప్రదమైన జీవనంతో పాటు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) తెలిపారు. బీసీ యువతకు ప్రభుత్వ నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తూ అధిక ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాల అందించడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. న్యూఢిల్లీలోని ఓక్ హాల్ లో శనివారం జరిగిన స్కోచ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పోటీ పరీక్షల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకు గానూ సోషల్ జస్టిస్ సెక్యూరిటీ విభాగంలో బంగారు స్కోచ్ అవార్డు వరించింది.
Minister Savitha Key Comments
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీల అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. అన్న ఎన్టీఆర్ వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రోత్సాహించారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారని చెప్పారు. అభివృద్ధి అట్టడుగు వర్గాలకు తీసుకెళ్లినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్రమోడి భావిస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్రమోడి, సీఎం చంద్రబాబు నాయుడు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో బీసీ నిరుద్యోగ యువతకు బీసీ సంక్షేమ శాఖ వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందజేశామన్నారు.
Also Read : Deepika Padukone Shocking Comments on Kalki 2 : కల్కి సీక్వెల్ నిష్క్రమణపై దీపికా కామెంట్స్
