Deepika Padukone : ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి సీక్వెల్ లో ఊహించని విధంగా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే (Deepika Padukone) ను తప్పించినట్లు ప్రకటించడం విస్తు పోయేలా చేసింది. తనపై ఈ మధ్య పెద్ద ఎత్తున ట్రోలింగ్ కొనసాగుతోంది. డార్లింగ్ ప్రభాస్ తో కొత్త మూవీ తీస్తున్నాడు పాన్ ఇండియా డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి. స్పిరిట్ మూవీ కోసం దీపికా పదుకొనేను తీసుకోవాలని అనుకున్నాడు. కానీ భారీ ఎత్తున రెమ్యూనరేషన్ పెంచడంతో తనను తప్పిస్తున్నట్లు ప్రకటించాడు. దీనిపై తీవ్రంగా ఖండించింది దీపికా పదుకొనే. ఇదే సమయంలో కల్కి మూవీలో కీ రోల్ పోషించింది. ఇది దేశ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. నిర్మాత అశ్విని దత్ కు మంచి లాభాన్ని చేకూర్చేలా పెట్టింది. ఈ తరుణంలో నాగ్ అశ్విన్ కీలక ప్రకటన చేశాడు. కల్కి బిగ్ సక్సెస్ కావడంతో సీక్వెల్ కూడా ఉంటుందని డిక్లేర్ చేశాడు.
Deepika Padukone Key Comments on Kalki Sequel
కల్కి 2898 AD నిర్మాతలు ఈ వారం ప్రారంభంలో దీపికతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఎందుకు విడి పోయిందనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. శనివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించింది. చిత్ర నిర్మాతలు వైజయంతి ఫిల్మ్స్ దీపికతో సినిమా తీయడం లేదని పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడ్డాక స్పందించింది. ఒక ఫోటోను షేర్ చేసింది. షారుఖ్ తో చేతులు పట్టుకుని ఉన్న చిత్రాన్ని పంచుకుంది. దీపిక తన జవాన్ సహ నటుడిని ప్రస్తావిస్తూ ఇలా రాసింది. దాదాపు 18 సంవత్సరాల క్రితం ఓం శాంతి ఓం సినిమా చేస్తున్నప్పుడు అతను నాకు నేర్పిన మొదటి పాఠం ఏమిటంటే, సినిమా తీసే అనుభవం, మీరు దానిని ఎవరితో చేస్తారో, దాని విజయం కంటే చాలా ముఖ్యం అని చెప్పారని తెలిపారు.
Also Read : Manchu Lakshmi Shocking Complaint : సీనియర్ జర్నలిస్ట్ పై మంచు లక్ష్మి ఫిర్యాదు
