Minister Savitha Interesting Update : పెనుకొండలో 68 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు

ప్ర‌క‌టించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత వెల్ల‌డి

Hello Telugu - Minister Savitha Interesting Update

Hello Telugu - Minister Savitha Interesting Update

Minister Savitha : శ్రీ స‌త్యసాయి జిల్లా : ఏపీ రాష్ట్ర బీసీ , సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత (Minister Savitha) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పెనుకొండ‌లో 68 ఎక‌రాల్లో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. మొదటి విడతగా 20 ఎకరాల్లో రోడ్లు, కాలువలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయల కల్పనకు రూ.7 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కేవలం 21 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులో పెట్టుబడిదారులకు ప్రభుత్వం భూములు కేటాయిస్తుందన్నారు. తమకు కేటాయించిన స్థలాల్లో రెండేళ్లలో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు మంత్రి. పరిశ్రమల ఏర్పాటుకు యువత ముందుకు రావాలని, ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Minister Savitha Key Comments

ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో పారిశ్రామికీకరణతో పాటు యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.
అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. చేయని మంచిని చేసినట్లు చెప్పుకోడానికి వైసీపీ నాయకులు చీప్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కియా పరిశ్రమను తీసుకొచ్చింది సీఎం చంద్రబాబు అని, ఈ విషయం ప్రపంచానికి తెలుసని, కాని, వైసీపీ నాయకుల మాత్రం తామే తీసుకొచ్చామని డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖలో ఏర్పాటు కాబోతున్న గూగుల్ డేటా సెంటర్ ను తామే తీసుకొచ్చినట్లు జగన్, వైసీపీ నాయకులు నిసిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. వారెన్ని అబద్ధాలు ఆడినా, వాస్తవాలు ప్రజలకు, ప్రపంచానికి తెలుసని మంత్రి సవిత చెప్పారు.

Also Read : RS Praveen Kumar Strong Demand for Srivarshita : శ్రీ‌వ‌ర్షిత కుటుంబానికి రూ. కోటి ఇవ్వాలి : ఆర్ఎస్పీ

Exit mobile version