RS Praveen Kumar Strong Demand for Srivarshita : శ్రీ‌వ‌ర్షిత కుటుంబానికి రూ. కోటి ఇవ్వాలి : ఆర్ఎస్పీ

తెలంగాణ స‌ర్కార్ గురుకులాల‌పై తీవ్ర వివ‌క్ష

Hello Telugu - RS Praveen Kumar Strong Demand for Srivarshita

Hello Telugu - RS Praveen Kumar Strong Demand for Srivarshita

RS Praveen Kumar : హైద‌రాబాద్ : ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ వేధింపులు తాళ‌లేక శ్రీ‌వ‌ర్షిత సూసైడ్ చేసుకుంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీఆర్ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar). ఆయ‌న శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. త‌న కుటుంబానికి తక్ష‌ణ‌మే రూ. కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మంత్రులు కాంట్రాక్టులు, పైసల కోసం కొట్లాడటంతోనే స‌రి పోయింద‌న్నారు. ఇక విద్యా వ్య‌వ‌స్థ‌ను గాలికి వ‌దిలి వేశార‌ని ఆరోపించారు. హోం శాఖ ప‌క్క‌దారి ప‌ట్టింద‌ని, లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోల్ త‌ప్పింద‌న్నారు. ఇక విద్యా శాఖ‌ను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి సోయి లేకుండా పోయింద‌న్నారు. పాల‌న‌పై ప‌ట్టు కోల్పోవ‌డంతో మంత్రులు వాటాల కోసం బ‌హిరంగంగానే ఆరోప‌ణ‌ల‌కు దిగుతున్నార‌ని ఇదేనా ప్ర‌జా పాల‌న అని ప్ర‌శ్నించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

RS Praveen Kumar Key Comments on Srivarshita

సీఎం తుపాకీ ఇచ్చారని మంత్రి కుమార్తె అంటున్నారని, మంత్రి నియోజకవర్గంలో శ్రీవర్షిత అనే అమ్మాయి చనిపోతే ప్రభుత్వం స్పందించక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చ‌రించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. సైదాపూర్ స్కూల్‌లో విద్యార్థులను ఎలుకలు కరిస్తే పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడ‌న్నారు. గురుకుల ప్రిన్సిపాల్స్, టీచర్ల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి పైసలు తీసుకుంటున్నారా అని ప్ర‌శ్నించారు . గురుకుల పాఠశాలలో శ్రీవర్షిత సూసైడ్ చేసుకుని చనిపోతే కుటుంబానికి పాడి కౌశిక్ రెడ్డి అండగా నిలిచారని అన్నారు. గత రెండు ఏళ్ళల్లో గురుకులాల్లో 110 మంది విద్యార్థులు చని పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆర్ఎస్పీ.

Also Read : CM Chandrababu Strong Instructions : ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగ కూడదు

Exit mobile version