క్వాంటం స్పీడ్ తో అవకాశాలు అందుకోండి : సీఎం

ఆక్వా, ఐటీ రంగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెంబ‌ర్ వ‌న్

hellotelugu-APCM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క్వాంటం స్పీడ్ తో అవ‌కాశాలు అందిపుచ్చు కోవాల‌ని పిలుపునిచ్చారు. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరిచిన యూఏఈ ఆరు నెలల్లోగా వాటిని సాకారం చేసే దిశగా ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులకు ఏపీ వేదిక కావటం సంతోషదాయకమని సీఎం వ్యాఖ్యానించారు. ఉద్యాన, ఆక్వా, ఐటీ రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాది పొడవునా వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులు సాగు చేస్తున్నామని సీఎం వివరించారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో 30 శాతం మేర ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వస్తోందని చెప్పారు.

రూ. 1 లక్ష కోట్ల ప్రభుత్వం, ప్రైవేటు పెట్టుబడితో రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ గా మారుస్తున్నామని తెలిపారు చంద్ర‌బాబు నాయుడు. రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్-ISAను కూడా ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వివరించారు. 200కు పైగా ఉద్యాన క్లస్టర్లతో అక్వా మిర్చి, పామాయిల్, కోకో, కాఫీ తదితర పంటల్లో ఏపీ ఎగుమతులు చేస్తోందని సీఎం యూఏఈ ప్రతినిధి బృందానికి వివరించారు. కృష్ణా-గోదావరి డెల్టాలో నిరంతర నీటి సరఫరా కారణంగా వ్యవసాయ ఉత్పత్తి సాధించ గలుగుతున్నామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీకి ఓ విధానంగా మారి పోయిందని అన్నారు సీఎం. ప్రగతిశీల విధానాల వల్ల దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయన్నారు. పోర్టులు, రైల్వై, రోడ్డు వ్యవస్థతో ఏపీ లాజిస్టిక్స్ కేంద్రంగా మారిందని అన్నారు. ఆగస్టు 1 తేదీ నుంచి ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీలో అందుబాటులోకి వస్తోందని వివరించారు. విస్తృతమైన వనరులతో వివిధ రంగాల్లో విస్తృత వ్యాపార అవకాశాలను అందించేందుకు ఏపీ సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి యూఏఈ బృందానికి తెలిపారు.

Exit mobile version