Minister Satyakumar Yadav: గుంటూరు జిల్లా – రాష్ట్రంలో 4.1 కోట్ల మందికి ఎన్సీడీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కేవలం 3 కోట్ల మందికి మాత్రమే పరీక్షలు చేయడం జరిగిందన్నారు మంత్రి సత్య కమార్ యాదవ్ (Minister Satyakumar Yadav). గురువారం గుంటూరు జిల్లా హ్యాయ్ లాండ్ చిన కాకాని లో నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్-కమ్యునకబుల్ డిసీజెస్ (NP-NCD)పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు మంత్రి.
Minister Satyakumar Yadav Key Comments
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పాల్గొన్న ఎన్సీడీ జిల్లా పీఓలు, ఎపిడమాలజిస్టులు, ప్రివెంటివ్ అంకాలజీ నోడలాఫీసర్లు, సిహెచ్ ఓలు, ఎఎన్ ఎంలు, మెడికల్ ఆఫీసర్లు. మూడు విడతలుగా చేసిన ఎన్సీడీ స్క్రీనింగ్ లో నాణ్యత లోపించిదన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్. అందుకే మరింత అవగాహన కల్పించేందుకే మూడు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించడం జరిగిందన్నారు.
ఎన్సీడీపై చేసే యుద్ధంలో ఎఎన్ఎంలు, సిహెచ్వోలు, మెడికల్ ఆఫీసర్లు, అంకాలజిస్టులే సైనికులు అని స్పష్టం చేశారు. 8 నెలల్లో 70 శాతం మేర ఎన్సీడీ స్క్రీనింగ్ చేయడం అభినందనీయం అన్నారు . 3.0 ఎన్సీడీ స్క్రీనింగ్ లో మధుమేహం, బీపీతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో క్యాన్సర్ పై కుడా స్క్రీనింగ్ చేశారని చెప్పారు సత్య కుమార్ యాదవ్. 4.1కోట్ల మందికి స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా 3 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా మరింత దూకుడు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మిగిలి పోయిన వారికి త్వరగా టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు మంత్రి సత్య కుమార్ యాదవ్.
Also Read : Minister Nimmala Interesting Comments : ఆర్థర్ కాటన్ లేక పోతే ఆంధ్రాకు కన్నీళ్లే
