Minister Nimmala : అమరావతి – ఆనాడు ఆంగ్లేయుడైన సర్ ఆర్థర్ కాటన్ గనుక ముందు చూపుతో ఆనకట్ట కట్టించక పోతే ఇవాళ ఆంధ్రకు నీళ్లు లభించి ఉండేవి కావని అన్నారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala). జూలై 24న గురువారం సర్ ఆర్థర్ కాటన్ వర్దంతి. ఈ సందర్బంగా అమరావతి సచివాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
Minister Nimmala Rama Naidu Praise Sir Arthar Cotton
సర్ ఆర్ధర్ కాటన్ ముందు చూపుతో ధవళేశ్వరం ఆనకట్ట తో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు, కృష్ణా ఆనకట్టకు అలుపెరుగని రీతిలో కృషి చేసిన మహానుభావుడంటూ కొనియాడారు.గత జగన్ ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ శాఖ విధ్వంశంతో కాటన్ దొర ఆత్మసైతం క్షోభిస్తోందన్నారు నిమ్మల రామానాయుడు. విధ్వంశానికి గురైన పోలవరం ప్రాజెక్టుతో పాటు, ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని చెప్పారు.
కాటన్ మహాశయుడి స్పూర్తితో గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలోకి పోకుండా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు . నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు మంత్రి. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు సాగు, త్రాగునీరు అందించనున్నామని ప్రకటంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పంట కాలవలు, మురుగు డ్రైన్ల మెయింటినెన్స్ పనులకు రూ 700 కోట్లను కేటాయించడం జరిగిందని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు.
Also Read :CJI Justice BR Gavai Shocking Comments : అడవులను కాపాడుతారా జైలుకు పంపాలా..?
