Minister Ponnam Fired on PM Modi : మోదీ కామెంట్స్ పొన్నం ప్ర‌భాక‌ర్ సీరియ‌స్

మాజీ ప్రధాని నెహ్రూపై అనుచిత వ్యాఖ్య‌లు

Hello Telugu - Minister Ponnam Fired on PM Modi

Hello Telugu - Minister Ponnam Fired on PM Modi

Minister Ponnam : అమ‌రావ‌తి : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై సీరియ‌స్ అయ్యారు రాష్ట్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ (Minister Ponnam). మాజీ దేశ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మీరు కొలువు తీరాక ఏం చేశారో దేశానికి చెప్పాల‌న్నారు. కులం, మతం , విద్వేషం త‌ప్పా చేసింది ఏమీ లేద‌న్నారు. ఏమైనా కొత్త ప్రాజెక్టుల‌కు శ్రీ‌కారం చుట్టారా అని ప్రశ్నించారు. భౌతికంగా మ‌న‌మ‌ధ్య లేని నాయ‌కుల ప‌ట్ల నోరు పారేసు కోవ‌డం ప్ర‌ధాన‌మంత్రికి త‌గ‌ద‌న్నారు. తాను చేసిన అనుచిత కామెంట్స్ ను బేష‌ర‌తుగా వెన‌క్కి తీసుకోవాల‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ డిమాండ్ చేశారు.

Minister Ponnam Prabhakar Slams PM Modi

స్వాతంత్ర ఉద్యమం గురించి ఏమాత్రం తెలియని మోదీ నెహ్రూ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఆయ‌న‌కు ఎలాంటి అవ‌గాహ‌న లేద‌న్నారు. కేవ‌లం అదృష్టం బావుండి దేశానికి పీఎం అయ్యారు త‌ప్పితే త‌న వ‌ల్ల దేశానికి, 143 కోట్ల ప్ర‌జానీకానికి మేలు జ‌ర‌గ‌లేద‌న్నారు. ఆయ‌న ఒక‌రి గురించి , ప్ర‌ధానంగా త‌మ నాయ‌కుల గురించి మాట్లాడే ముందు దేశ చ‌రిత్ర‌, స్వాతంత్రం గురించి తెలుసుకోవాల‌ని, అప్పుడే మాట్లాడితే మంచిగా ఉంటుంద‌న్నారు. అహింసా పద్ధతిలో స్వాతంత్రం సాధించిన గాంధీ, ఇందిరా గాంధీల పట్ల ద్వేషం పెంచుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఇలానే మాట్లాడితే దేశ ప్రజలు క్షమించరని అన్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోక పోతే చరిత్ర హీనులుగా మిగిలి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : YS Sharmila Strong Demand : స‌ర్వం కోల్పోయిన రైతుల‌ను ఆదుకోవాలి

Exit mobile version