Minister Ponnam Shocking Comments : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై పొన్నం షాకింగ్ కామెంట్స్

హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటిష‌న్లు దాఖ‌లు

Hello Telugu - Minister Ponnam Shocking Comments

Hello Telugu - Minister Ponnam Shocking Comments

Minister Ponnam : హైద‌రాబాద్ : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్లకు సంబంధించి కావాల‌ని బిల్లును ఆమోదించ‌కుండా అడ్డు త‌గులుతున్నారంటూ ఆరోపించారు. సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల సౌక‌ర్యం క‌ల్పిస్తూ త‌యారు చేసిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం కూడా జ‌రిగింద‌న్నారు. ఆ బిల్లును గవర్నర్‌కు , తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపామని, అక్కడ అది ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలన్న తెలంగాణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు సిద్ధమవుతోంది.

Minister Ponnam Prabhakar Comments

ఈ మ‌యంలో వివరణాత్మక సర్వే, క్యాబినెట్ ఆమోదం తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) తెలిపారు. గ‌త 5 నెల‌లుగా త‌మ వ‌ద్ద‌నే బిల్లును పెండింగ్ లో పెట్ట‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాము న్యాయ‌బ‌ద్దంగా బీసీల‌కు రావాల్సిన వాటా గురించే బిల్లును త‌యారు చేయ‌డం జ‌రిగింద‌న్నారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. చ‌ట్టం కూడా చేశామ‌ని, కానీ అప్రూవ‌ల్ కావాలంటే త‌ప్ప‌నిస‌రిగా గ‌వ‌ర్న‌ర్ సంత‌కం చేయాలి. అక్క‌డి నుంచి నేరుగా రాష్ట్ర‌ప‌తి ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంద‌న్నారు. ఇప్ప‌టికి 5 నెల‌ల‌కు పైగా స‌మ‌యం గ‌డిచి పోయింద‌న్నారు. ఇంత వ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ నుంచి కానీ అటు రాష్ట్ర‌ప‌తి నుంచి కానీ స్పంద‌న క‌నిపించ‌డం లేద‌న్నారు. దీనికంత‌టికీ కార‌ణం బీజేపీనంటూ నిందించారు పొన్నం ప్ర‌భాక‌ర్.

Also Read : Supreme Court Strong Notice on Ladakh : లడ‌ఖ్ హింస‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్

Exit mobile version