ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇక్క‌డ ఏం ప‌ని..?

త‌ను తెలంగాణ‌కు పూర్తిగా వ్య‌తిరేకం

hellotelugu-PonnnamPrabhakar

క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. కులం పేరుతో, మ‌తం పేరుతో విద్వేషాలు రెచ్చ‌గొట్టే త‌న‌కు తెలంగాణ‌లో ఏం ప‌ని అంటూ ప్ర‌శ్నించారు. జ‌నం త‌న‌ను స్వీక‌రించే స్థితిలో లేరన్నారు. ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని సూచించారు . మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని ప్ర‌సంగించారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. కాస్తా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాల‌ని లేక పోతే తెలంగాణ స‌మాజం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క్ష‌మించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌తో బీజేపీ పొత్తును మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణను అవమానించేలా మాట్లాడే పవన్, నిధులు ఇవ్వకుండా మోసం చేసే బీజేపీ కలిసి రావడంపై ప్రజలు ఆలోచించాలని కోరారు. రాష్ట్ర వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఈ పార్టీలను మేధావులు, ప్రజలు సహించబోరని అన్నారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. వారికి బుద్ధి చెప్పాలని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నార‌ని ఉన్నారు. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని, తాము క్లీన్ స్వీప్ చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Exit mobile version