Minister Narayana : అమరావతి – అమరావతిలో మంత్రి నారాయణ (Minister Narayana) పర్యటించారు. సీఆర్డీయే ఇంజనీర్లతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనాల పనుల పురోగతిని పరిశీలించారు. పనుల ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి లో టెండర్లు పూర్తయిన పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ప్రజా ప్రతినిధులు, అధికారుల కోసం 4000 ఇళ్ల పనులు చేసేందుకు అవసరమైన మ్యాన్ పవర్ 90 శాతం ఉందన్నారు. మెషినరీ ఈనెలాఖరుకు పూర్తిగా వస్తుందన్నారు నారాయణ.
Minister Narayana Key Comments on Amaravati
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ అధికారులు, సెక్రటరీలు, మంత్రులు,జడ్జిల బంగ్లాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏఐఎస్ అధికారుల క్వార్టర్లు డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తామని చెప్పారు. మిగిలిన భవనాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ముందుకు వెళుతున్నామన్నారు. వర్షాకాలంలో పనులకు ఆటంకం లేకుండా ఇంటర్నల్ పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం రైతులను, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టిందన్నారు.
న్యాయపరమైన సమస్యలు రాకుండా టెండర్ల విషయంలో ముందుకెళ్లామని చెప్పారు. అమరావతి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు నారాయణ. రాజధానిలో ఇప్పటివరకూ మొత్తం 72 సంస్థలకు భూములు కేటాయించామన్నారు. భూములు తీసుకున్న సంస్థలతో నేరుగా సీఎం మాట్లాడారని అన్నారు. మెజారిటీ సంస్థలు డిసెంబర్ నెలాఖరుకు పనులు ప్రారంభిస్తామని చెప్పాయన్నారు.
Also Read : Shaik Salauddin Alarming : గిగ్ కార్మికుల కనీస వేతన హక్కును చట్టబద్ధం చేయండి
