Shaik Salauddin Alarming : గిగ్ కార్మికుల కనీస వేతన హక్కును చట్టబద్ధం చేయండి

టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ డిమాండ్

Hello Telugu - Shaik Salauddin Alarming

Hello Telugu - Shaik Salauddin Alarming

Shaik Salauddin : హైదరాబాద్ |- తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గిగ్ కార్మికుల బిల్లులో కనీస వేతన హామీ లేక పోవడం బాధాకరమైన విషయ‌మని పేర్కొన్నారు తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల యూనియన్ (TGPWU) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ (Shaik Salauddin) 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికులకు న్యాయం, వేతన భద్రత, సామాజిక రక్షణ కల్పిస్తామని అధికార పార్టీ బహిరంగంగా హామీ ఇచ్చిందన్నారు. ఇప్పుడు బిల్లులో కనీస వేతనం అంశం లేక పోవడం ఆ హామీకి వ్యతిరేకంగా ఉందన్నారు.

Shaik Salauddin Comments

ఎన్నికల సమయంలో కార్మికులకు హామీ ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కనీస వేతనం లేని చట్టం, కార్మికుల కోసం కాదని, అది యాప్ కంపెనీల కోసం అని అన్నారు షేక్ స‌లావుద్దీన్. తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ కార్మికుల బిల్లులో కనీస వేతనం చేర్చాలన్నారు. అప్పట్లో ఎన్నికల హామీ ప్రకారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాలన్నారు.
ప్లాట్‌ఫామ్ కంపెనీలు రోజువారీ లేదా గంటల వారీగా కనీస వేతనం చెల్లించేలా నిబంధనలు చేర్చాలి
కనీస వేతనం దాని సరిపోలే ఆదాయం ఉండేలా నిర్ధారించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల శ్రమకు గౌరవం కలిగించేలా, వేతనం గ్యారెంటీ ఉండాలి. అలా చేయకపోతే, ఈ చట్టానికి అభిప్రాయ స్వరూపమే లేద‌న్నారు. టీజీపీడబ్ల్యూయూ తరఫున‌ రేవంత్ రెడ్డి , కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి త‌క్ష‌ణ‌మే హామీకి సంబంధించి బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయాల‌న్నారు.

Also Read : PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

Exit mobile version