Minister Narayana Interesting Update : అమ‌రావ‌తి ల్యాండ్ పూలింగ్ కు సీఆర్డీఏ ఓకే

స్ప‌ష్టం చేసిన మంత్రి పొంగూరు నారాయ‌ణ

Hello Telugu - Minister Narayana Interesting Update

Hello Telugu - Minister Narayana Interesting Update

Minister Narayana : అమ‌రావ‌తి – అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులపై సీఆర్డీఏ ఆమోదం తెలిపింద‌న్నారు మంత్రి నారాయ‌ణ‌. రాబోయే 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామ‌న్నారు. అదనపు ల్యాండ్‌ పూలింగ్‌కు 7 గ్రామాలు అంగీకరించాయ‌ని వెల్ల‌డించారు. కొత్తగా 20,494 ఎకరాలకు ప‌ర్మిష‌న్ ల‌భించింద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో రాజ‌ధాని నిర్మాణం చేప‌డ‌తామ‌న్నారు. అద‌న‌పు ల్యాండ్ పూలింగ్ గురించి కొంద‌రు ప్ర‌త్యేకించి వైసీపీ నేత‌లు దుష్ప్ర‌చారం చేసినా చివ‌ర‌కు రైతులు ఇచ్చేందుకు ముందుకు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు మంత్రి నారాయ‌ణ‌.

Minister Narayana Key Update on Amaravathi

37 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కు సీఆర్డీఏ అనుమతి ఇచ్చిందని చెప్పారు. నారాయ‌ణ (Minister Narayana) మీడియాతో మాట్లాడారు. కొత్తగా 20,494 ఎకరాలకు సీఆర్డీఏ ఆమోదం లభించిందన్నారు. గతంలో తీసుకున్న భూముల్లో ఎకనామిక్ యాక్టివిటీ పెరగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అందుకే 2500 ఎకరాల్లో స్మార్ట్ సిటీ, 2500 ఎకరాల్లో స్పోర్ట్ సిటీ, 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి సీఆర్డీఏ ఆమోదం ల‌భించింద‌న్నారు. అంతే కాకుండా గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు ప్ర‌భుత్వం కేటాయించింద‌ని చెప్పారు పొంగూరు నారాయ‌ణ‌.

MSK ప్రసాద్ అంతర్జాతీయ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలతో పాటు కిమ్స్ మెడికల్ కాలేజీకి 25 ఎకరాలు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. అంతే కాకుండా భార‌తీయ జ‌న‌తా పార్టీకి కూడా 2 ఎక‌రాలు ఇందులో ఇచ్చామ‌న్నారు.

Also Read : Botsa Satyanarayana Fired on AP Govt : కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తాం నిల‌దీస్తాం

Exit mobile version