Botsa Satyanarayana : అమరావతి – కూటమి సర్కార్ వైఫల్యాల గురించి బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana). ప్రజల తరపున తమ వాయిస్ వినిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే తాట తీస్తానంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తున్నారని, ఇందుకోసమేనా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది అంటూ నిలదీశారు. బాధ్యత కలిగిన పార్టీగా తాము సమస్యలను ప్రస్తావిస్తామన్నారు.
Botsa Satyanarayana Slams AP Govt
బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చింది మీరు కాదా అని అన్నారు. పైగా తమను టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అని అన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొలువు తీరాక ప్రచారం తప్పా ఎక్కడా పని కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. దీని వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ ఉండదన్నారు. ఈ విషయం తను గుర్తిస్తే మంచిదని సూచించారు.
ప్రజలు ఎన్నుకున్నది రాజ్యాంగం ప్రకారం పాలన చేయమని, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేందుకు కాదన్నారు బొత్స సత్యనారాయణ. బాబు, పవన్ కళ్యాణ్ లు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మీరు రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదంటూ ఫైర్ అయ్యారు.
హామీల పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టారని, చివరకు వాటిని అమలు చేయలేక తమపై కేసులు నమోదు చేయడం స్టార్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు. ప్రజల తరపున తాము వారి సమస్యల గురించి ఏకరువు పెడతామని, దానికి బాధ్యతాయుతంగా సమాధానం ఇవ్వాలన్నారు.
Also Read : Minister Seethakka Shocking Comments : డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం ఏంటి..?
