Minister Lokesh : అమరావతి : మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా నియమించ బోతున్నారని, ఇందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్రంగా స్పందించారు అదే పార్టీకి చెందిన మంత్రి , సీఎం ఏకైక తనయుడు నారా లోకేష్ (Minister Lokesh). ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల కవితను తమ పార్టీలోకి తీసుకోవడం అంటే వైసీపీ బాస్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తమ పార్టీలోకి తీసుకున్నట్టేనని భావించాల్సి ఉంటుందన్నారు. ఆయన తమతో కలవరు. మేం తనను తీసుకునే ఛాన్సే ఉండదన్నారు నారా లోకేష్.
Minister Lokesh Key Comments ok Kavitha Joining
అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పై కూడా స్పందించారు. కేటీఆర్ తో కలవాలని అనుకుంటే సీఎం పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. తనకు కేటీఆర్ కు మధ్య చాలా దగ్గరి సంబంధం ఉందన్నారు. తామిద్దరి మధ్య స్నేహం ఉందని చెప్పారు. అలాగని ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని అన్నారు నారా లోకేష్. ఇదే సమయంలో కేటీఆర్ ను ఎందుకు కలవ కూడదంటూ ప్రశ్నించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకులు, కార్యకర్తల బలగం ఉందన్నారు. ఇందులో భాగంగానే తాము ఇక్కడ బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Also Read : PM Modi Interesting Comments : రాధాకృష్ణన్ జీవితం ప్రజా సేవకు అంకితం
