Minister Lokesh Important Update : పాలిటెక్నిక్ కాలేజీల‌కు సొంత భవనాల నిర్మాణం

శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్

Hello Telugu - Minister Lokesh Important Update

Hello Telugu - Minister Lokesh Important Update

Minister Lokesh : అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవని, 2 పాలిటెక్నిక్ కళాశాలలకు కూటమి ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్ (Minister Lokesh). శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో స‌మాధానం ఇచ్చారు. మిగిలిన వాటిలో చోడవరం, పొన్నూరు, బేతంచర్ల, మైదుకూరు, గుంతకల్లులో పాలిటెక్నిక్ కాలేజీల‌కు భూములు కేటాయించామ‌ని పేర్కొన్నారు. మరో మచిలీపట్నం, కెఆర్ పురం , అనపర్తిలకు భూములు కేటాయించాల్సి ఉంద‌న్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం, ఎంపి లాడ్స్, సిఎస్ఆర్ నిధులను అనుసంధానించి సొంత భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించే ప్రతిపాదనలపై అసెంబ్లీ సమావేశాల ఏడో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, అయితాబత్తుల ఆనందరావు, మద్దిపాటి వెంకటరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు.

Minister Lokesh Key Comments

బి.మఠం నవోదయ స్కూలును తాత్కాలిక భవనాల్లో ప్రారంభించే విషయమై కేంద్ర మంత్రితో మాట్లాడతామ‌ని చెప్పారు. కోనసీమ హయ్యర్ ఎడ్యుకేషన్ లో వెనుకబడి ఉందన్నారు. అందుకే అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేశామ‌న్నారు, త్వరలోనే పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కోనసీమలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసే అంశంపై చర్చిస్తామ‌ని చెప్పారు లోకేష్. పాలిటెక్నిక్ లలో అడ్మిషన్లు 70 శాతంగా ఉన్నాయ‌న్నారు. కన్వెన్షనల్ కోర్టులకు ఎవరూ రావడం లేదన్నారు. కోర్సులను రీడిజైన్ చేయాల్సి ఉంద‌న్నారు.. మార్కెట్ లింక్, ఓరియంటెడ్ కోర్సులను తీసుకు రావాల్సి ఉందన్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ లో లేటెస్ట్ కోర్సులను తీసుకువచ్చి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ చెప్పారు.

Also Read : Bathukamma Kunta Interesting : స‌ర్వాంగ సుంద‌రంగా మారిన‌ బ‌తుక‌మ్మకుంట‌

Exit mobile version