Minister Kondapalli : అమరావతి : ఎంఎస్ఈలను మరింత బలోపేతం చేసేందుకు తమ సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli). ప్రపంచ వృద్ధికి క్లస్టర్లు, టెక్ , క్రెడిట్ మద్దతును ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని ఒక హోటల్‌లో ఏపీ ఎంఎస్ఎంఈ ఎగుమతి అభివృద్ది సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాల్గొన్న ప్రతినిధులను సన్మానించారు. అనంతరం ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ బలమైన పారిశ్రామిక సమూహాలను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. అంతే కాకుండా సూక్ష్మ యూనిట్ల నుండి ప్రపంచ వ్యాప్తంగా పోటీతత్వ సంస్థలుగా మారడానికి గాను ఎంఎస్ఈలను మరింత శక్తివంతం చేసే పనిలో పడిందన్నారు కొండపల్లి శ్రీనివాస్.
Minister Kondapalli Srinivas Comments
రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం ఉందన్నారు. ఇప్పటికే ఏపీ పరిశ్రమలకు కేరాఫ్ గా మారిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ తన ఏఐ హబ్ ను విశాఖలో ఏర్పాటు చేసిందని చెప్పారు మంత్రి. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో తాము భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరిస్తున్నామని చెప్పారు కొండపల్లి శ్రీనివాస్, పోటీతత్వాన్ని పెంచడానికి సాధారణ సౌకర్యాల కేంద్రాలను నిర్మిస్తున్నామని తెలిపారు. వ్యవస్థాపకుల కోసం అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ, బలమైన ఎంఎస్ఎఈ పర్యావరణ వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధి దృక్పథానికి కేంద్రంగా ఉందన్నారు.
Also Read : K Kavitha Fired on Congress Govt : బాధితులను పట్టంచుకోని కాంగ్రెస్ సర్కార్
