K Kavitha Fired on Congress Govt : బాధితుల‌ను ప‌ట్టంచుకోని కాంగ్రెస్ స‌ర్కార్

నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

Hello Telugu - K Kavitha Fired on Congress Govt

Hello Telugu - K Kavitha Fired on Congress Govt

K Kavitha : వ‌రంగ‌ల్ జిల్లా : వ‌రంగ‌ల్ జిల్లాలో ఇండ్లు కోల్పోయిన బాధితుల‌కు భ‌రోసా ఇవ్వాల్సిన అవ‌స‌రం స‌ర్కార్ పై ఉంద‌న్నారు తెలంగాణ జాగృతి సంస్థ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ (K Kavitha). జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా ఆమె వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ప‌లు అంశాల‌ను ఆమె ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, ప్ర‌ధానంగా ఇండ్లు కోల్పోయిన వారిని ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవ‌న్నారు. జిల్లాకు సంబంధించి ఇద్ద‌రు మంత్రులు ఉన్నా ఫాయిదా లేకుండా పోయింద‌న్నారు. స్వంత ప‌నులు చూసుకోవ‌డం పైన ఉన్నంత శ్ర‌ద్ద ప్ర‌జ‌ల‌పై లేక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

K Kavitha Slams Congress Govt

వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలోని ఎస్ఆర్ నగర్ లో డబుల్ బెడ్రూం ఇండ్లు రాని బాధితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశంమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్ నగర్ లో మొత్తం వెయ్యి కుటుంబాల వరకు ఉన్నాయని తెలిపారు. గతంలో 150 ఇళ్లు కూల్చేసి కొత్తగా 750 ఇళ్లు నిర్మించారని చెప్పారు క‌విత‌. తమ స్థలం ఇచ్చి వేరే వారికి ఇళ్లు వచ్చేలా పెద్ద మనసు చేసుకున్నారు ఈ కాలనీ వాసులని ప్ర‌శంసించారు. ఇంత మంది ఉంటున్నా సరే వారికి ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదని ఆరోపించారు. క‌రెంట్ లేదు, తాగేందుకు నీళ్లు కూడా రావ‌డం లేద‌న్నారు. ఇప్ప‌టికైనా స‌ర్కార్ స్పందించి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

Also Read : DY CM Pawan Kalyan Clear Instructions : హనుమాన్ ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేయాలి

Exit mobile version