Minister Komatireddy Important Meet : ప‌త్తి రైతులకు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించండి

సీసీఐ చైర్మ‌న్ ను క‌లిసిన మంత్రి కోమ‌టిరెడ్డి

Hello Telugu - Minister Komatireddy Important Meet

Hello Telugu - Minister Komatireddy Important Meet

Minister Komatireddy : ముంబై : తెలంగాణ రాష్ట్రంలోని ప‌త్తి రైతుల‌ను ఆదుకోవాల‌ని కోరారు మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. మంగ‌ళ‌వారం ఆయ‌న ముంబైలోని కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా కార్యాల‌యంలో చైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ ల‌లిత్ కుమార్ గుప్తాను క‌లిశారు. ఆయ‌న వెంట జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా రైతులు అత్య‌ధికంగా ప‌త్తిని సాగు చేశార‌ని తెలిపారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులపై ఆయనతో చర్చించి, లేఖను అందజేశారు.

Minister Komatireddy Key Meeting

రాష్ట్రంలో పత్తి పంట సాగు విస్తీర్ణం 45 లక్షల ఎకరాలకు పైగా ఉందని చెప్పారు. అయితే ఈ సీజన్‌లో అకాల వర్షాలు, సైక్లోన్ ప్రభావం, పురుగు దాడులు , పెరిగిన ఉత్పత్తి ఖర్చులు రైతులను తీవ్రంగా కుంగదీశాయని పేర్కొన్నారు. పత్తికి కనీస మద్దతు ధర (MSP) ప్రకటించినా, మార్కెట్‌లో రైతులు దాన్ని పొందలేక పోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి (Minister Komatireddy). ఈ నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెంటనే జోక్యం చేసకోవాల‌ని, క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌ను పెంచాల‌ని కోరారు. అంతే కాకుండా పత్తి సాగు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు.

గత సీజన్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాల‌ని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాల‌ని విన్న‌వించారు. పురుగు నిరోధక విత్తనాలపై పరిశోధన, పంపిణీ బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also Read : K Kavitha Strong Demand : ఉద్దండాపూర్ రైతుల‌కు ప‌రిహారం ఇవ్వాలి

Exit mobile version