K Kavitha : పాలమూరు జిల్లా : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ను సందర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (K Kavitha). ఉద్దండపూర్ నిర్వాసిత రైతులతో మాట్లాడారు. వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. ఉద్దండాపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని అన్నారు. 2021 నాటికే కటాఫ్ పెట్టటం సరికాదని అన్నారు. పరిహారం ఇచ్చే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వాల్సిందని స్పష్టం చేశారు కవిత. తప్పు బీఆర్ఎస్ దా, కాంగ్రెస్ దా అని కాదు. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారనేది ముఖ్యమన్నారు.
K Kavitha Strong Demand
ప్రజలకు, ముఖ్యంగా రైతులకు మంచి జరగాలని మాత్రమే తాను కోరుకుంటానని ఆ దిశగా ఆలోచిస్తానని స్పష్టం చేశారు కవిత. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు ఈ ప్రభుత్వం చేస్తుందా? లేదా? అనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం జనం బాటలో భాగంగా ఇక్కడ పర్యటించడం జరిగిందన్నారు. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ లో నీళ్ల కరువు ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. వందల ఎకరాలు ఉన్న వారు కూడా నీళ్లు లేక వలస పోయారని తెలిపారు. తెలంగాణ వచ్చాక కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా నీటి సౌలత్ మంచిగా చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ వచ్చాక చాలా మంచి పనులు జరిగాయి. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కృష్ణా నది నీళ్లను వినియోగించు కోవాలని కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టారని చెప్పారు కవిత.
Also Read : Nara Lokesh Clear Instructions : పునరావాస చర్యలు చేపట్టండి : లోకేష్
