Minister Kandula Durgesh Interesting Comments : రైతుల సంక్షేమం కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన ప‌ర్యాట‌క శాఖ మంత్రి దుర్గేష్

Hello Telugu - Minister Kandula Durgesh Interesting Comments

Hello Telugu - Minister Kandula Durgesh Interesting Comments

Kandula Durgesh : అమ‌రావ‌తి : ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించే రైతులకు అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు కూట‌మి స‌ర్కార్ అంద‌జేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh).రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కడియం మండలం బుర్రిలంక గ్రామంలో రూ.205 లక్షల వ్యయంతో MGNREGS, మండల పరిషత్ నిధులతో బుర్రిలంక కాలువగట్టు నుండి ఏటి గట్టు వరకు నిర్మించిన సిమెంట్ రోడ్డును రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో కలిసి ప్రారంభించారు.

Minister Kandula Durgesh Comments

స్థానిక శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చొరవతో పాటు పర్యాటక శాఖ సహకారం, నాటి కలెక్టర్ ఇచ్చిన ప్రోత్సాహంతో నిర్మించిన ఈ రోడ్డు నర్సరీ రైతులు, ఎస్సీ సొసైటీ భూములు కలిగిన రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ల స‌మ‌ర్థ‌ నాయకత్వంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు కందుల దుర్గేష్.

గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం పాలైన రహదారులను పునరుద్ధరించడం, గ్రామాభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి యాత్రను ముందుకు తీసుకు వెళ‌తామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా పెద్ద ఎత్తున సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

Also Read : BRS New Innovation from Jubilee Hills : జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర

Exit mobile version