BRS : హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు తోట మహేష్ ముదిరాజ్, ఆయన అనుచరులు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వాస్తవం కాలేదని, పేదల ఆశలు దెబ్బ తిన్నాయని ఆయన మండిపడ్డారు . కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయని కేటీఆర్ గుర్తు చేశారు.
BRS Jaitra Yatra From Jubilee Hills
20 వేల లీటర్ల వరకు ఉచిత మంచి నీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5 కే భోజనం, పింఛన్లు, రంజాన్ తోఫాతో పాటు అనేక పథకాలు అమలు చేశామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ను కూడా తీసేశామన్నారు. పేదలను కడుపులో పెట్టుకొని కేసీఆర్ చూసుకున్నారని చెప్పారు కేటీఆర్. షేక్‌పేటలో పెద్ద ఫ్లై ఓవర్‌ను నిర్మించామన్నారు. జీహెచ్‌ఎంసీలో, హైదరాబాద్‌లో ప్రతి ఎన్నికలోనూ ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటేశారని పేర్కొన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బకాయిలతో ముంచేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, రైతులు, మహిళలు అందరిని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
మేం మోసపోయాం, కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు మోసపోవద్దు. అరచేతిలో స్వర్గం చూపిస్తే ఊళ్లలో కొందరు మోసపోయారు. అందుకే గ్రామాల నుంచి రైతులు, ప్రజలు వచ్చి జూబ్లీహిల్స్‌కు వచ్చి ప్రచారం చేస్తామని చెబుతున్నారని అన్నారు. మేనిఫెస్టోను రాజకీయ పార్టీలకు పవిత్ర గ్రంథంగా భావించకుండా, కేవలం గ్యారెంటీ కార్డులు అని ఇంటింటికి పంచారని కేటీఆర్ విమర్శించారు.
Also Read : Case Registered on Kurnool Bus Incident Death : కర్నూలు బస్సు ఘటనపై కేసు నమోదు
