Minister Kandula Durgesh Important Update : ప‌ర్యాట‌క రంగానికి పారిశ్రామిక హోదా

స్ప‌ష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్

Hello Telugu - Minister Kandula Durgesh Important Update

Hello Telugu - Minister Kandula Durgesh Important Update

Kandula Durgesh : విశాఖ‌ప‌ట్నం : ప‌ర్యాట‌క రంగానికి కేరాఫ్ గా ఏపీ రాష్ట్రాన్ని మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). విశాఖ న‌గ‌రం వేదిక‌గా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు ప్రారంభ‌మైంది. ఇవాల్టితో ఈ స‌ద‌స్సు ముగుస్తుంది. ఈ సంద‌ర్బంగా సీఐఐ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన‌ టూరిజం స్టాల్ ను ప్రారంభించి సందర్శించారు. టూరిజం స్టాళ్ల వివరాలను తెలిపారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి, టూరిజం శాఖ అధికారులు.

Minister Kandula Durgesh Comments

రాష్టంలో ఎక్కడెక్కడ ఏయే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో తెలుసుకునేలా టచ్ క్యూయోస్ మెషిన్ ను ప్రారంభించడం జ‌రిగిందని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా క‌ల్పించ‌డంతో పునరుత్తేజం వచ్చిందని అన్నారు. నూతన పర్యాటక పాలసీపై ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. త్వరలోనే పర్యాటక రంగం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాం అన్నారు కందుల దుర్గేష్.

రాష్ట్ర పర్యాటక రంగానికి కేంద్ర సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ప్రత్యేక శ్రద్ధతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. 15 నెలల కాలంలో పర్యాటక రంగంలో దాదాపు 12 వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించామ‌ని వెల్ల‌డించారు. విశాఖ సీఐఐ సమ్మిట్ కు అద్భుత స్పందన వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతో దాదాపు 70కి పైగా దేశాల నుండి ప్రతినిధులు వచ్చారని చెప్పారు కందుల దుర్గేష్. విశాఖపట్నం సీఐఐ సమ్మిట్ లో మంత్రి నారా లోకేష్ తో సహా పలువురు మంత్రులు కూడా ప‌ర్యాట‌క శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సంద‌ర్శించారు.

Also Read : DY CM Pawan Kalyan Important Comments : ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌ను అడ్డుకున్న గ్రామ‌స్థులు

Exit mobile version