Pawan Kalyan : అమరావతి : ఎర్ర చందనం అక్రమ రవాణాపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఆయన అందిస్తున్న భరోసా ప్రజల్లో చైతన్యం నింపుతోంది. తను ఇచ్చిన స్ఫూర్తితో చిత్తూరు జిల్లా అప్పినపల్లి గ్రామస్తులు ఎర్ర చందనం దొంగల ఆటకట్టించారు. ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకుని దుంగలను అటవీశాఖ అధికారులకు పట్టించారు. అక్రమంగా రవాణా చేస్తున్న 10 ఎర్ర చందనం దుంగలను, ఆ గ్రామ ప్రజల సహకారంతో శుక్రవారం అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో సహకరించిన అప్పినపల్లి గ్రామస్తులను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభినందించారు. ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డు కునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలకు తమవంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతోనే దుంగల దొంగల వాహనాన్ని వెంబడించినట్టు అప్పినపల్లి గ్రామస్తులు తెలిపారు.
DY CM Pawan Kalyan Key Comments
తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ పులిచర్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక టవెరా వాహనం అనుమానాస్పదంగా దూసుకు వెళ్లింది. అటవీ అధికారులు ఆ వాహనాన్ని వెంబడించగా వారు బెంగళూరు వైపు వేగంగా వెళ్లిపోయారు. మార్గ మధ్యంలో వాహనం నుంచి దూకి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. వాహనంలో ఉన్న డ్రైవర్ వేగంగా నడుపుకొంటూ ముందుకు వెళ్లాడు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో గ్రామస్తులు ఆ వాహనాన్ని వెంబడించారు. దీంతో డ్రైవర్ కూడా వాహనాన్ని ఒక పక్కన ఆపి పారిపోయాడు. పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేయగా అక్రమంగా 10 ఎర్ర చందనం దుంగలు దొరికాయి. సమాచారాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వచ్చారు. ఎర్ర చందనం దొంగల ఆటకట్టించే క్రమంలో గ్రామస్తులు చూపిన చొరవ, ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు.
Also Read : KTR Shocking Comments : ప్రజా తీర్పును స్వాగతిస్తాం : కేటీఆర్
