Minister Kandula Durgesh Proven : విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు

పిలుపునిచ్చిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్

Hello Telugu - Minister Kandula Durgesh Proven

Hello Telugu - Minister Kandula Durgesh Proven

Kandula Durgesh : అమ‌రావ‌తి – విద్యార్థ‌/ల స‌మ‌గ్ర పురోగ‌తి కోసం కూటమి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని అన్నారు ప‌ర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పిటిఎం 2.0)లో వెల్ల‌డించారు. నిడదవోలు నియోజకవర్గంలో పండుగలా మెగా పేరెంట్స్‌ టీచర్స్ మీటింగ్‌..ఏటా రెండు పర్యాయాలు నిర్వహించాలని ఆదేశించారు. తరగతి గదుల్లోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలుండాలని సూచించారు.

Minister Kandula Durgesh Invites

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా పేరెంట్స్‌ టీచర్స్ మీటింగ్‌ ను ఉద్యమంగా తీసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు కందుల దుర్గేష్. విద్యావ్యవస్థలో వినూత్న మార్పులు, విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని వివరించిన మంత్రి దుర్గేష్

భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు వేద్దామని నినదించారు. .విద్యారంగంలో నూతన వికాసానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని వెల్లడించారు. విద్యార్థి సమగ్ర పురోగతిని పర్యవేక్షించడం ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థికి మెరుగైన మద్దతు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మాణం అవుతుందన్నారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగాలన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థికి ఏ రంగంపై ఆసక్తి ఉందో తెలుసుకొని తద్వారా అవసరమైన ప్రోత్సాహం అందించాలంటే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. చ‌దువుకునే స‌మ‌యం విద్యార్థుల జీవితాల్లో అత్యంత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు కందుల దుర్గేష్ . భాగంగా డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.

Also Read : YS Jagan Fired on AP Govt : మీరు మ‌నుషులా లేక రాక్ష‌సులా – జ‌గ‌న్

Exit mobile version