YS Jagan Fired on AP Govt : మీరు మ‌నుషులా లేక రాక్ష‌సులా – జ‌గ‌న్

పోలీసుల‌పై వివాదాస్ప‌ద కామెంట్స్

Hello Telugu - YS Jagan Fired on AP Govt

Hello Telugu - YS Jagan Fired on AP Govt

YS Jagan : అమ‌రావ‌తి – మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నోరు పారేసుకున్నారు. పోలీసుల‌ను టార్గెట్ చేశారు. మీరు ఖాకీలా లేక రాక్ష‌సులా అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. డీఐజీ, ఎస్పీలు, లంచాలు తీసుకునే సీఐల మాట‌లు మీరు వినొద్దంటూ పేర్కొన్నారు. త‌మ పార్టీకి చెందిన 12 మందిని అక్ర‌మంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. కూట‌మి ప్ర‌స్తుతం అధికారంలో ఉంద‌ని, రేపు త‌మ‌కు ప‌వ‌ర్ వ‌స్తుంద‌న్నారు. అప్పుడు చూసుకుంటామ‌ని ఒక్కొక్క‌రి ప‌ని ప‌డ‌తామంటూ హెచ్చ‌రించారు. ఎవ‌రికి ఆప‌ద వ‌చ్చినా ప‌లికేది తాను మాత్ర‌మేనని అన్నారు.

YS Jagan Slams AP Govt

పొగాకు, మామిడి, మిర్చి రైతుల‌కు ఇబ్బందులు ఏర్ప‌డిన ప్ర‌తిసారి తానే స్పందిస్తున్నాన‌ని ఇంకెవ‌రూ ముందుకు రావ‌డం లేద‌న్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan). ఎంప్లాయిస్ కు ఐఆర్ ఇవ్వాల‌న్నా, పీఆర్సీ కోసం కొట్లాడాల‌న్నా తానే ముందున్నాన‌ని చెప్పారు. కూట‌మి స‌ర్కార్ జ‌నాన్ని, రైతుల‌ను మోసం చేస్తోంద‌ని ఆరోపించారు. ఇవాళ క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రాక నానా ఇబ్బందులు ప‌డుతున్నా ఎందుకు ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇది పూర్తిగా బాధ్య‌తా రాహిత్యంతో కూడిన స‌ర్కార్ అంటూ మండిప‌డ్డారు.

ఒక్క చిత్తూరు జిల్లాలోనే 2.20 ల‌క్ష‌ల ఎక‌రాల్లో మామిడి పంట సాగు చేశార‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి. 76 వేల మందికి పైగా వీటిపై ఆధార‌ప‌డ్డార‌ని తెలిపారు. వారి ఖాతాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.12 వేలు జ‌మ చేయ‌లేద‌ని వాపోయారు. లారీల్లో స్టాక్ పెట్టుకుని , అద్దెలు చెల్లించలేక , అప్పులు తీర్చ‌లేక నానా తంటాలు ప‌డుతున్నా సీఎం చంద్ర‌బాబు స్పందించ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

Also Read : YS Sharmila Fired on AP Govt : క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో స‌ర్కార్ ఫెయిల్

Exit mobile version